Category: Telugu Worship Songs Lyrics
-
Dhayagalayaesu paapikaashrayudaa దయగలయేసు పాపికాశ్రయుడా
దయగలయేసు పాపికాశ్రయుడాప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము ఓ ప్రభూ నీకు విరోధముగా పాపము చేసిన దురితుండనునీచుడనై నిన్ను వేధించితిన్ ఓ నాథా పాపిని క్షమించుము లోకాశలన్నియు శోధించగా నా కాయమంతయు క్షీణించెనునా కాశ్రయంబు నీవే ప్రభూ ఓ నాథా పాపిని మన్నించుము నా ధనము ఘనము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితిన్ఓ దేవా నేను రిక్తుండను నా దురితంబులను బాపుమా అందరు నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరిఅందరు నన్ను విడువంగను నా తండ్రీ…
-
Dhayagala yaesu prabhoo దయగల యేసు ప్రభూ
దయగల యేసు ప్రభూ – నిన్ను యెరుగ కృపనిమ్ముసర్వజనము నీ పునరుత్థాన శక్తిని గ్రహియింప యౌవనులయందు కలిగించుము నీ భయము మరి వణకునునీ రక్షణను కొనసాగింప జేయుము ఓ ప్రభువా ! నీ మాటలు వినిపించుము నీ మార్గములలో నడిపించునిలుపుము నీదు సాక్షులు గాను యౌవన జనములను అపవిత్రజనముల మధ్యలో నీ వాక్యమును ప్రకటింపకుమ్మరించుము పరిశుద్ధాత్మను యౌవనజనములపై నీ సంఘమునందు నిలుచుండి నీ దర్శనము గుర్తెరిగిఎల్లప్పుడునూ ఆనందింప జేయుము యౌవనులను నీ మరణ పునరుత్థానములో పాలి వారినిగా…
-
Dhappigonina vaaralaaraa దప్పిగొనిన వారలారా
దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి అను పల్లవి: కాసు రూకలు లేకున్నను త్రాగను రండి యెషయా యిరువదియైదు ఆరవ వచనము చదివిత్రాగుచు తృప్తి పొందను రండి రండి క్రొవ్విన పదార్థమును పాత ద్రాక్షారసమునుక్రొవ్వు మెదడు గలవాటిని తినుటకు రండి నేనే జీవపానమును – నేనే పరమాహారమునురూకలను వ్యర్థము చేయక – రండి రండి నా మాంసమే పరమాహారం – నే చిందించిన రక్తమేపానంతిని త్రాగిన వారికి కల్గును నిత్యజీవం ద్రాక్షారసము ఓదార్చున్ – జల్దరు తృప్తిపరచున్నీకు…
-
Dhappigonina vaanipai దప్పిగొనిన వానిపై
దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువేఎండియున్న భూమిపై జలముల్ – ప్రవహింప జేయునాయనే వడిగల జలములలో దారిన్ – నిర్మించును ఆ ప్రభువేఅడవులలో రాజబాటలను – స్థాపించును మన ప్రభువే మన సంతతిపై ఆత్మన్ – కుమ్మరించును మన ప్రభువేతన ఆత్మలో వారిని నింపి – నిర్మించును సంఘముగా నీటికాలువలయొద్ద – నిరవంజి చెట్లవలెగడ్డిలో యెదుగునట్లు – వారు వర్ధిల్లెదరు కరుణాపీఠము పై నుండి – మాట్లాడెను మన దేవుడేపరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన…
-
Dhaaniyaelvale దానియేల్వలె సాహసించుడి
దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలెసాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యముఁగలిగి దీనులై యా దృఢ కార్యం బిఁకఁ బూని తెల్పను సాహసించుడి||దానియేల్|| నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెలఁ గ్రక్కున గైకొనుజనములగాంచి చక్కఁగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరుఁ పించుచుమిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుఁడీ ||దానియేల్|| ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనఁబడువారనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమదివారలే ప్రభుదేవుని భట పరి వారమునఁబడి యుందురు నిజ మిఁక||దానియేల్|| కాన నీ సువిశేషమును…
-
Dhinamu gathiyimchenu దినము గతియించెను
దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁకమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము|| సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువాదొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము|| కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెంగట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము|| తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేమువలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము|| ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద…
-
Dhinadhinamuku dhikku దినదినముకు దిక్కు
దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడనెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు|| పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁగావు మమ్ముఁ గావు మమ్ము ||దినదినమునకు|| పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁబ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు|| కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతోచూపుదువే చూపుదువే ||దినదినమునకు|| నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు…
-
Dhaathruthvamunu galigi దాతృత్వమును గలిగి
దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱుగుదమ ||దాతృ|| శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ||దాతృ|| సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ||దాతృ| గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందునేర్పింతమ ||దాతృ|| సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ||దాతృ|| ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయబోధింతమ ||దాతృ|| విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతోదర్శింతము…
-
Dhaatumu yordhaanun దాటుము యొర్దానున్
దాటుము యొర్దానున్ యాత్రికుడానాలుగు ఘడియలకే అతిథివి నీవిచట ఇహలోకములో సుఖమే లేదు గడ్డిని బోలినదేజీవిత మంతయును నీడలు క్షణములో మారినరీతిన్ జీవితముండు గదాఆవిరి సమమే గదా వ్యర్థము వ్యర్థము మాయలోకములోని సర్వమునుచెత్తను బోలినదే కన్నులెత్తి చూడుము క్రీస్తున్ ఆయనే సర్వములోమహోన్నతుండు సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవుకానాను దేశమున వాక్యము మార్గము జూపును నీకు క్రీస్తునే గురిగానుంచుకొనుము సదా Dhaatumu yordhaanun yaathrikudaanaalugu ghadiyalakae athiThivi neevichat ihaloakamuloa sukhamae laedhu gaddini boalinadhaejeevitha mMthayunu…
-
Dhigulu padaku saevakaa దిగులు పడకు సేవకా
దిగులు పడకు సేవకా దిగులు పడకుమయానమ్మదగిన దేవుడు నిన్ను పిలిచె గదాకష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి ఆదరించునుగానీతోనే నడచి నీలోనే నిలచి నిన్ను నడుపునుగాఓ సేవకా భయపడకిక జయము నీదె గదా అగ్నివంటి శోధనలకు భయపడకుమయాఅగ్నిలోను క్రీస్తు అండ తోడుండగాఅగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘనపరచునుగాషద్రకు మేషకబెద్నెగోలను మరచిపోకుమాఓ సేవకా భయపడకికా అగ్ని మేలెగదా ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమానీకున్న అవసరతలు తండ్రికి తెలియునుగాఆకాశము నుండి మన్నాను పంపి పోషించె గదాఐదు రొట్టెలు రెండు చేపలు…