Category: Telugu Worship Songs Lyrics

  • Ennirojulaguno yesuni suvarta ఎన్నిరోజులగునో యేసుని సువార్త

    ఎన్నిరోజులగునో యేసుని సువార్తఅన్ని దేశములకు అందించ ఎన్నిరోజులగునో (2) సాతాను తంత్రములు పెరిగెడి రోజులలోదేవుని పిల్లలందు ఐక్యత కనిపించునా (2) అక్కర పెరుగుచుండ అవకాశము చేజారదీనులై సేవకులు కలిసెడి రోజెపుడో (2) కోపము క్రోధములు విసుకు విభజనలుదేవుని సంఘమును ఎన్నడు విడనాడన్ (2) Ennirojulaguno yesuni suvartaAnni desamulaku amdimcha ennirojulaguno (2) satanu tamtramulu perigedi rojulaloDevuni pillalamdu aikyata kanipimchuna (2) akkara peruguchumda avakasamu chejaraDinulai sevakulu kalisedi rojepudo (2) kopamu…

  • kaanaapurmbuloaao gadu vimthagaa neeru కానాపురంబులోఁ గడు వింతగా నీరు

    కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసిపానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా|| రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చుహితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేతభావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా|| దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడుతండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయములేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా|| ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును…

  • kanyaa garbhamuna butti కన్యా గర్భమున బుట్టి

    కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన కన్యా సుతుండ నిన్నేనమ్మితి నో యేసునాధ కన్ను లెత్తి మమ్ముఁ జూడుము ||కన్యా|| బాల ప్రాయమున నేను బాగుగా నీ పాద సేవఁ జాలజేసి యున్న వాడనుగా యో యేసు నాధ చాల దయతో మేలు చేయుమి ||కన్యా|| ఇంపైనట్టి మరియ తనయ యిహము పరము నేలు బాల సొంపుగా నీప్రాపే గోరితి నో యేసునాధ చెంపఁ గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా|| తుంటతనము చేత జగము తంటాచేసి తిరుగుచుంటి…

  • koniyaadi paadi keerthimchi కొనియాడి పాడి కీర్తించి

    కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా పరిశుద్ధుడవు నీతిమంతుడవుపాపపు వస్త్రము మార్చిన దేవప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివిపొగడెద నిన్ను ధవళవర్ణుడా తూర్పు జ్ఞానులు నీ కర్పించిరిబంగారు సాంబ్రాణి బోళముతెలుపబడెను నీ ఘనవిజయముభరియించెద నిన్ను రత్నవర్ణుడా గుర్తించెద నిన్ను ఘనముగా నేనుఘనుడా నాకు ప్రభుడవు నీవేపదివేలలో నా ప్రియుడగు ప్రభువాపరికించి నిన్ను పాడి స్తుతించెద ఆరాధించెద ప్రభువా దేవాఆత్మతోను సత్యముతోనుతిరిగి రానై యున్న ప్రభువాస్తుతియు ఘనత మహిమయు నీకే koniyaadi paadi keerthiMchi varNiMchedha ninu naa…

  • kanare yaesuni prathyakshmbu కనరె యేసుని ప్రత్యక్షంబు

    కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య జనులకు గల్గిన, విధమెట్లొ తరచి||కనరె|| నక్షత్రమార్గాన జ్ఞానుల్ బోయి రక్షకుని జూచిరి రక్తిమీరంగకాంక్షతో ప్రభునికి మ్రొక్కి కాంకల్ కాంతిమీరగ నిచ్చి తరలిరి పరగన్||కనరె|| పదియు రెండేడ్ల, ప్రాయమున ప్రభువు పస్కాపండుగునకు పరగబోయెనుగముదమొప్ప దేవాలయములో జేరి ముద్దుగ బోధించె బోధకులకును||కనరె|| కానాయూరి పెండ్లికరిగి ప్రభువు ఘనముగ నీళ్లు ద్రాక్షా రసముగజేసెన్తనరమహిమను బయలుపరచి శిష్యుల మనములబలపర్చె ఘనవిశ్వాసమున ||కనరె|| కుష్థరోగి యొకడువచ్చి తనదు కుష్ఠరోగము బాప ప్రభునివేడంగఇష్టబుద్ధితో ప్రభువువాని ముట్టి కుష్ఠురోగము బాపె కోర్కెలూరంగ…

  • kraisthavulaaraa lemdi yeenaadu క్రైస్తవులారా లెండి యీనాడు

    క్రైస్తవులారా! లెండి యీనాడుక్రీస్తు పుట్టెనంచు పాడుఁడి;ప్రసన్నుఁడైన తండ్రి ప్రేమనుఆసక్తిపరులై కీర్తించుఁడిక్రీస్తేను మానవాళితోడనునశింపవచ్చెనంచు పాడుఁడి. దేవుని దూత గొల్లవారికిఈ రీతిగాను ప్రకతించెనుః‘ఈ వేళ మహా సంతోషంబగుసువార్త నేను ఎరిగింతును.దావీదు పట్నమం దీదినముదైవరక్షకుఁడు జన్మించెను.’ త్వరగానే ఆకాశ సైన్యముహర్షించుచు నీలాగు పాడెను‘సర్వోన్న తాకాశంబునందుండుసర్వేశ్వరునికి ప్రభావమునరులయందు సమాధానముధరణిలో వ్యాపింపనియ్యుఁడు’. పరమతండ్రి దయారసమునరులకెంతో నాశ్చర్యమునరావతారుఁడగు దేవుఁడునిరపరాధిగాను జీవించినిర్దోషమైన త్రోవ చూపించివిరోధులన్ ప్రేమించుచుండెను. శ్రీ మాత సైన్యముతో మేమునువాద్యములు వాయించుచుందుము;ఈ దినమందు నుద్భవించినయా దివ్యకర్తను వీక్షింతుము;సదయుఁడైన యేసు ప్రేమనుసదా స్తుతించి పాడుచుందుము. kraisthavulaaraa! leMdi…

  • kalavari mettapai kalavara కలవరి మెట్టపై కలవర

    కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమలొందినీ ప్రాణము బెట్టితి ||కల|| తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మనుగుందితి ||కల|| పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు||కల|| దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల|| జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి||కల|| శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు kalavari mettapai kalavara mettidhosiluvetuloarchithivoa palushramaloMdhinee praaNamu bettithi ||kala||…

  • kaalaviluva neeku theliyakapoayina కాలవిలువ నీకు తెలియకపోయిన

    కాలవిలువ నీకు తెలియకపోయిన – కన్నీరు కార్చెదవు భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశముభావమందు తలచి యేసుచే జీవించుము ఇష్టప్రకారము మనసు వీడి నడచి – కోప పాత్రుడ వగుదువెరక్షణ్య జీవితమొంది సంతోషించననుగ్రహ కాలమిదే యని తెలిసి ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె – నని తెలిసికొనుముఘనమైన పనిని మరచి నిద్రించినపగలు గతించక నిక నేమి చేతువు నోవహుకాలమున నూట ఇరువది – యేండ్లు చూచి లోకమునునశింప జేసెను కృపతో నీ కిడినఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన…

  • kalvariloani shraeshtudaa కల్వరిలోని శ్రేష్టుడా

    కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమాకన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడాసుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడాపాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి|| దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడానీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి|| ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేలజనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరి|| నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివిమేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| రోగులను బాగుచేయువాడా…

  • Chadavaali chadavaali vaakyam చదవాలి చదవాలి వాక్యం

    చదవాలి చదవాలి వాక్యం చదవాలిప్రతిరోజూ చదువుతు ఉండాలి /2/చెయ్యాలి చెయ్యాలి ప్రార్ధన చెయ్యాలిప్రతిఉదయం యేసుకు చెప్పాలి /2/ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలిసర్వస్వం యేసై ఉండాలి /2/చేరాలి చేరాలి పరమును చేరాలిఎల్లప్పుడు యేసుతో ఉండాలి /2/ Chadavaali chadavaali vaakyam chadavaaliPratiroju chaduvutu vundaali /2/Cheyaali cheyyaali praardhana cheyyaaliPrativudayam Yesuku cheppaali /2/Yedagaali yedagaali Yesulo yedagaaliSarvaswam Yesi vundaali /2/Cheraali cheraali pramunu cheraaliYellappudu Yesuto vundaali /2/