Chakkani paraloaka చక్కని పరలోక

చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడో
మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని
యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని||

నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాల
ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని||

పన్నెండు ద్వారముల పరమపురమును
నా కన్నుజూచుట యెన్నడో చెన్ను
మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో ||చక్కని||

పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో
పరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుట
యెన్నడో ||చక్కని||

మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగను
టెన్నడో అహహా యా ప్రభునితో మహిమపరచబడి
మహికేతెంచుట యెన్నడో ||చక్కని||

పాపశరీరముఁ బాసి ప్రభుని యొక్క రూపునొందుటయెన్నడో పాప
మరణ దుఁఖ మీ యాపదల కెడ బాపు నొందుట యెన్నడో ||చక్కని||

రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే
ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని||


Chakkani paraloaka sambandhulathoa
goodi santhoaShinchuta yennadoa
mikkili priyamaina thandri dhaevuni
yedhuta mrokki paaduta yennadoa ||chakkani||

Nithyammu vilasillu nijarathnapunaadhu
la thyuththama puramuna muthyaala
dhvaaramula mudhamuthoa boavuchu
nruthyameppudu chaethumoa ||chakkani||

Pannemdu dhvaaramula paramapuramunu
naa kannujoochuta yennadoa chennu
meerga bhakthashraeshtulathoagoodi
sannuthinchuta yennadoa ||chakkani||

Parishudhdhadhoothalathoa prabhuyaesu
marala yee dharakaethenchuta yennadoa
paripoornulathoa goodi bahumaanamunu
bondhi muriyu chunduta yennadoa ||chakkani||

Mahimakireetamu dhariyimchiyunna yaa mahithu niganu
tennadoa ahahaa yaa prabhunithoa mahimaparachabadi
mahikaethenchuta yennadoa ||chakkani||

Paapashareeramu baasi prabhuni yokka
roopunomdhutayennadoa paapa
maraNa dhukha mee yaapadhala keda baapu
nomdhuta yennadoa ||chakkani||

Rammurammu yaesu mammu nee puramukoni pommu vaevaegamunae
immahikashtamulanundi nemmadhi ni
thyammu nimmu vaegamae ||chakkani||


Posted

in

by

Tags: