చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువు
పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది
పాపి నీకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది
దేహమంతయు నలగి – శోకము చెందినవాడై
దేవాది దేవుని – ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే
తండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను
రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు – హృదయము పగలగ – విజ్ఞాపనము చేసెనే
ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే – మన యేసు
ప్రభువు – తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే
ప్రేమామృత వాక్కులచే – ఆదరించెడి ప్రభువు – వేదన
సమయమున – బాధపరచెడి వారి కొరకు ప్రార్ధన చేసెనే
నన్ను తనవలె మార్చెడి – ఈ మహా ప్రేమను త-ల-చి
తలచి హృదయము కరుగగ – సదా కీర్తించెదను /చూడుము/
Chudumu gethsemane – Totalo naa prabhuvu
Paapi naakai vijnaapana chesedi – Dwhanivinabaduchunnadi
Paapi neekai vijnaapana chesedi – Dwhanivinabaduchunnadi
Dehamantayu nalagi – Shokamu chendinavaadai
Devaadhi devuni – Yekaika sutudu padu vedanalu naa korake
Tandri ee paatra tolagun – Nee chittamaina yedala
Yetlainanu nee chittamu cheyutaku nannappaginchitivanenu
Rakthapu chemata valana – Mikkili baadhanondi
rakshakudesu – hrudayamu pagalaga – vijnaapanamu chesene
Mummaaru bhoomimedapadi mikkili vedanache – Mana Yesu
Prabhuvu – Taane vedukonenu – paapula vimochana korake
Premaamruta vaakkulache – aadarinchedi prabhuvu – vedana
samayamuna – baadhaparachedi vaari koraku praardhana chesene
Nannu tanavale marchedi – ee maha premanu talachi
talachi hrudayamu karugaga – sadaa keertinchedanu / Chudumu/