దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
దేవుడేసే జీవజలము – త్రాగ రారండి
హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి
జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్
జలము పొంది – జీవము నొంద జలనిధి చేరండి ||దేవుడేసే||
నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు
అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి ||దేవుడేసే||
తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు
తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి ||దేవుడేసే||
Daahamu gonnavaaralaaraa daahamu teerchukonandi
devudese jeevajalamu – traaga raarandi
hallelujah (hallaelooya) Devudese jeevajalamu traaga raarandi
Jeeva jalamu Sree Yesukreestu jeevapu Vutalu pravahimpa jeyunn
jalamu pondhi – jeevamu nondha jalanidhi cherandi ||Devudese||
Nenichchu neeru traagedivaaru ennatikini daahamugonaru
ani selavichchina Prabhu Yesu kreestu chenthaku cherandi ||Devudese||
Thana paapamulanu eriginavaadu tandri kshamaapana korinavaadu
thappaka pondunu jeevajalamu tvarapadi parugidi randi ||Devudese||