దేవా నన్నేల విడిచినావయా
దేవా నన్నేల మరిచినావయా
దీనుడను నేను దిక్కులేని వాడను
దయచూపి ఆదుకొనుమయా
అల్పుడను నేను అనాదను నేను
దరిచేరి ఆదరించుమయా
దేవా.. నా దేవా
నా యేసయ్యా(2)
ఎన్నో ఆశలతో జీవించుచుండగా
అంతా నా వారేనని నమ్మియుండగా(2)
ప్రేమించినవారే నను మోసగించి
నే నమ్మినవారే నా చేయి విడిచి(2)
ఒంటరిగా చీకటిలో నిలిచియుంటిని(2)
దేవా.. నా దేవా
నా యేసయ్యా(2)
నా జీవితం సుడిగుండాల వలయం
ఊహించని మలుపులే నిత్య ప్రాప్తం(2)
అనుకున్నవి జరగకా అనుకోనివి జరుగుతు
అందరు విడిచిన అనాదనైతిని(2)
చావలేక బ్రతకలేక కుములుచుంటిని(2)
దేవా.. నా దేవా
నా యేసయ్యా(2)
దేవా నీకై జీవింతును
నా దేవ నీకై సాక్షినౌదును
దయ చూపి ఆదుకొనుమయా
దేవా నీకై జీవింతును
దేవ నీకై సాక్షినౌదును(2)
చేయి చాపి ఆదరించుమయా
Deva Nannela Vidichinavaya Christian Song Lyrics in English
Deva nannela vidichinavayaa
Deva nannela marichinaavayaa
dheenudanu nenu dikkuleni vaadanu
dayachoopi aadukonumayaa
alpudanu nenu anaadhanu nenu
daricheri aadarinchumayaa
Devaa.. naa Devaa
naa Yesayyaa(2)
Enno aasalatho jeevinchuchundagaa
anthaa naa vaarenani nammiyundagaa(2)
preminchinavaare nanu mosaginchi
ne namminavaare naa cheyi vidichi(2)
ontariga cheekatilo nilichiyuntini
Devaa.. naa Devaa
naa Yesayyaa(2)
Naa jeevitham sudigundaala valayam
oohinchani malupule nithya praaptham(2)
anukunnavi jaragakaa anukonivi jaruguthu
andharu vidichina anaadhanaithini(2)
chaavaleka brathakaleka kumuluchuntini
Devaa neekai jeevinthunu
naa deva neekai saakshinoudhunu
daya choopi aadukonumayaa
devaa neekai jeevinthunu
naa deva neekai saakshinoudhunu(2)
cheyi chaapi aadarinchumaya