దేవుని సన్నిధిలో
ప్రతి రోజు నువ్వు గడిపే సమయం ఎంత
శోధన సమయంలో
ఆపవాదిని ఎదురించే ధైర్యం ఎంత (2)
రాకడ సమయంలో – యేసుని చేరే విశ్వాసం
ఈ లోకపు పందెంలో నీకున్న సహనమెంత (2)
ఎంతా ఎంత – శ్రమ ఏదైనా
నువ్వు కనపరిచే – పోరాటం ఎంతా
ఎంతా ఎంత – నీ శత్రువు పైనా
నువ్వు చూపించే – వాత్సల్యం ఎంతా ||దేవుని||
తన పోలికలోనే నిన్ను నిర్మించాడు
తన ఏలికలోనే నిన్ను ఊహించాడు (2)
తన ఆజ్ఞను మీరి – నువ్వు చేసిన పాపాలన్ని
దేవుని మనసును బాధించిన ఆ గాయం లోతెంత (2)
ఎంతా ఎంత – పాపివైన
నిను రక్షించిన – తండ్రి ప్రేమ ఎంత
ఎంతా ఎంత – ఆ కలువరి సిలువలో
నీకై కార్చిన – రక్తం విలువెంత ||దేవుని||
నిను పిలిచినవాడు – ఎంతో నమ్మదగినవాడు
ఆ పిలుపుకు తగినట్టు – దేవుని పనిలో వాడబడు (2)
ఆత్మల కొరకైన – దేవుని దాహం తీర్చే భారం
దేవుని సేవలో కొనసాగే నీ ప్రయాసం ఎంత (2)
ఎంతా ఎంత – స్థితి ఏదైనా
నువ్వు అర్పించే స్తుతి యాగం ఎంత
ఎంతా ఎంత – దేవుని పనికై
నువ్వు చేసే త్యాగం ఎంత ||దేవుని||
Devuni Sannidhilo
Prathi Roju Nuvu Gadipe Samayam Entha
Shodhana Samayamlo
Apavaadini Edurinche Dhairyam Enthaa (2)
Raakada Samayamlo – Yesuni Chere Vishwaasam
Ee Lokapu Pandemlo Neekunna Sahanamentha (2)
Enthaa Entha – Shrama Edainaa
Nuvu Kanapariche – Poraatam Entha
Enthaa Entha – Nee Shathruvu Paina
Nuvu Choopinche – Vaathsalyam Entha ||Devuni||
Thana Polikalone Ninnu Nirminchaadu
Thana Elikalone Ninnu Oohinchaadu (2)
Thana Aaznanu Meeri – Nuvu Chesina Paapaalanni
Devuni Manasunu Baadhinchina Aa Gaayam Lothenthaa (2)
Enthaa Entha – Paapivaina
Ninu Rakshinchina – Thandri Prema Entha
Enthaa Entha – Aa Kaluvari Siluvalo
Neekai Kaarchina – Raktham Viluventha ||Devuni||
Ninu Pilichinavaadu – Entho Nammadaginavaadu
Aa Pilupuku Thaginattu – Devuni Panilo Vaadabadu (2)
Aathmala Korakaina – Devuni Daaham Theerche Bhaaram
Devuni Sevalo Konasaage Nee Prayaasam Entha (2)
Enthaa Entha – Sthithi Edainaa
Nuvu Arpinche Sthuthi Yaagam Entha
Enthaa Entha – Devuni Panikai
Nuvu Chese Thyaagam Entha ||Devuni||