Dhaaruna magu marana vaaridhi దారుణ మగు మరణ వారిధి

దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర
మగు కెరటములవలె వి స్తారముగ
నేరములు పైఁగొని పారు చుండునప్పు
డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||

ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు
ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద
మని తలంచినఁ జెక్క నిర్మతమైన
యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||

మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట
పొంగి పారుచు మరణ నది త రంగములఁ
జెలంగుచున్నది భంగపడకుఁడి
మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||

వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును
బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన
క్రీస్తు యేసు నాధుఁడే నావి
కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ||

మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె
దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన
మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||

విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ
గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే
హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||

పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు
ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల
గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||

కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున
మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ
మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||


DhaaruNa magu maraNa vaariDhi dhaaAOta
ne vvaari shakyamu soadhara ghoara
magu keratamulavale vi sthaaramuga
naeramulu paiAOgoni paaru chuMdunappu
dadhdhariAO jaeru tetlu dhaariAO ganarae ||dhaaruNa||

okka pettuna negasi chakka velLudha mana
nee rekka lakkaRaku raavu
ekkadainanu noada ganuAOgoni yekkipoadha
mani thalMchinAO jekka nirmathamaina
yoada lakkaRaku raavaemi saethumu ||dhaaruNa||

mMgaLa Dhvanulathoa shruMgaarapuramu
ve luMguchunnadhi muMdhata
poMgi paaruchu maraNa nadhi tha rMgamulAO
jelMguchunnadhi bhMgapadakuAOdi
manaku kreesthu suvaarthayanu penu naava yidhigoa ||dhaaruNa||

vaadha rahithuMdaina yaadhi dhaevuAOdu
dhaani naaDhuM danM barAOgunu
baaDha loMdhina narula nMdhariAO jaerAOdheesina
kreesthu yaesu naaDhuAOdae naavi
kuAO du kraisthava vaedhamae chukkaani dheeviki ||dhaaruNa||

maanavu lMdharu maraNaaMbuDhini
dhaaAOta mahaneeya magu naava yidhe
dheeniloa nekkutaku muMdhae maanuga
vaakyamunu vini su jnYaana
moMdhinavaaru kraisthava snaana manu
pathrikanu boMdhare ||dhaaruNa||

vidhithMbugaa niMdhu vijnYaana
boadhakul vinipiMchudhuru vaakyamuAO
godhagonina yaathmamulu thrupthiAO
gonunu brabhu bhoajanamuloanae
hrudhayamulaloa dhaevunaathma yepudu
dheepMbai veluMgunu ||dhaaruNa||

paluviDha sMgeetha mulathoa saaguchu
manamu nalaya kuMdAOgAO boadhu
mu balamugala yee yalalu dhaaAOti
parama puradhvaaramula velupala
galisikoni parishudhDha janamunu
gadaku moakShmu chaerukoMdhumu ||dhaaruNa||

karuNaamayuni sabhaloaAO jorakapoayina
nithya naraka mMtha mMdhuna
mariyu nMthya dhinapu baaDhalu viriviga
vinAO goaruvaaralu maraNa
moMdhaka munu prathyakShee karuNa manu
grMThamanu vinarae ||dhaaruNa||


Posted

in

by

Tags: