Dhaasula praarthana దాసుల ప్రార్థన

దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు
దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట
||దాసుల||

జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్
తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస
మిడునఁట ||దాసుల||

మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్
హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల
కోర్కె లిచ్చునట ||దాసుల||

ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్
వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత
రక్షణు(డట ||దాసుల||


Dhaasula praarThana dhappaka yesAOgedu
yaesu naayakuAOdai maa vaelpu
dhoasamulu saeyu dhurjanuAOdainanu
dhoasi loggAO bara vaasi jaeyunAOta ||dhaasula||

jana rahitha sThala muna jani vaeAOdedi
manujula praarThana vinuchuMdun
thana paadhamu na mmina saaDhooththama
janulanu joochina sMthasa midunAOta ||dhaasula||

madhi vishvaasamu goodina praarThana
sadhayatha vinutakuAO jevu loggun
hrudhayamu kanuAOgoni yuchitha
samayamuna gudhuruga bhakthula
koarke lichchunata ||dhaasula||

mudhamuna nidhdharu mugguru nokachoaAO
badhilamugaaAO dhanuAO braarDhiMpan
vadhalaka dhaanata vachchi yuMdhu nani
mrudhuvugAO balikina krutha rakShNu(data ||dhaasula||


Posted

in

by

Tags: