దాటుము యొర్దానున్ యాత్రికుడా
నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట
ఇహలోకములో సుఖమే లేదు గడ్డిని బోలినదే
జీవిత మంతయును
నీడలు క్షణములో మారినరీతిన్ జీవితముండు గదా
ఆవిరి సమమే గదా
వ్యర్థము వ్యర్థము మాయలోకములోని సర్వమును
చెత్తను బోలినదే
కన్నులెత్తి చూడుము క్రీస్తున్ ఆయనే సర్వములో
మహోన్నతుండు
సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవు
కానాను దేశమున
వాక్యము మార్గము జూపును నీకు క్రీస్తునే గురిగా
నుంచుకొనుము సదా
Dhaatumu yordhaanun yaathrikudaa
naalugu ghadiyalakae athiThivi neevichat
ihaloakamuloa sukhamae laedhu gaddini boalinadhae
jeevitha mMthayunu
needalu kShNamuloa maarinareethin jeevithamuMdu gadhaa
aaviri samamae gadhaa
vyarThamu vyarThamu maayaloakamuloani sarvamunu
cheththanu boalinadhae
kannuleththi choodumu kreesthun aayanae sarvamuloa
mahoannathuMdu
siluvanu moasi saagumu priyudaa chaerudhuvu neevu
kaanaanu dhaeshamun
vaakyamu maargamu joopunu neeku kreesthunae gurigaa
nuMchukonumu sadhaa