దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు
పాప పరిహారార్థ ఊట తెరచెన్
పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా!
ఇపుడు విడుదలను కోరి పొందెదవా!
పల్లవి: రక్తమందు రక్తమందు
పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా
రక్తమందు రక్తమందు – ఇపుడు విడుదలను కోరి పొందెదవా
అపవిత్రుడైనను అక్రమస్తుడైనను
ఆ పవిత్రరక్తము శుద్ధిచేయును
ఏలు పాపమైనను – అతిక్రమమైనను
ఏలికచే మన్నింపబడి యున్నావా
ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివా
మాయవేషమంతయు వీడియున్నావా
పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా
శాపలోకముపై జయ మొందుచున్నావా
ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా
అల్పవిషయములోను సత్యమున్నదా
నాడు మరణించిన యేసులేచియున్నాడు
నేడుయేసున్ చేరిన యభయ మిచ్చును
పంచఖండములను రక్షించుట కొరకు
పంచగాయ మొందిన ప్రభుని చూడుమా
ఇంచుకైన త్రోయడు డాసినట్టి వారల
మించు సత్యములను కోరి వెదకుము
రేపు రేపు యనుట నమ్మిక కానేరదు
మాపు మరణించిన నెచటి కేగుదువు
ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపిన
శ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును
హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకు
కల్ల కార్యములను విడచివేయుము
చెల్లచెదరగును కష్టము లచ్చోటను
కొల్లగా ననుభవింతువు సుఖంబును
Dhaeva gorrepilla siluvaloa samasinapudu
paapa parihaaraarTha oota therachen
paapi neevu aarakthamMdhu nilachiyunnaavaa!
ipudu vidudhalanu koari poMdhedhavaa!
Chorus: rakthamMdhu rakthamMdhu
paapi neevu aa rakthamMdhu nilichiyunnaavaa
rakthamMdhu rakthamMdhu – ipudu vidudhalanu koari poMdhedhavaa
apavithrudainanu akramasthudainanu
aa pavithrarakthamu shudhDhichaeyunu
aelu paapamainanu – athikramamainanu
aelikachae manniMpabadi yunnaavaa
priyulaaraa yanu prabhuni pilpu viMtivaa
maayavaeShmMthayu veediyunnaavaa
paapa bMDhamu liMka ninnu kattiyunnavaa
shaapaloakamupai jaya moMdhuchunnaavaa
aathmajeeva shareerMbula narpiMchithivaa
alpaviShyamuloanu sathyamunnadhaa
naadu maraNiMchina yaesulaechiyunnaadu
naeduyaesun chaerina yabhaya michchunu
pMchakhMdamulanu rakShiMchuta koraku
pMchagaaya moMdhina prabhuni choodumaa
iMchukaina throayadu daasinatti vaaral
miMchu sathyamulanu koari vedhakumu
raepu raepu yanuta nammika kaanaeradhu
maapu maraNiMchina nechati kaegudhuvu
praapakuMdagu yaesuni chiththamunu jaripin
shree paaluMdu ninnuththamuMdani mechchunu
hallelooyaa paadumu shakthigala yaesuku
kalla kaaryamulanu vidachivaeyumu
chellachedharagunu kaShtamu lachchoatanu
kollagaa nanubhaviMthuvu sukhMbunu