దేవుని ప్రార్థించెదము – దైవ పుత్రుని నామమందు
అడుగుడి – మీకు – నిత్తుననెన్
వెదకుడి – మీకు – దొరకుదును
మదిని – నమ్మి – మీరు – తట్టినచో
ముదమున – తలుపు – తీయుదుననె
గూఢమైన – సంగతులిలన్
గాఢమై – నీవు – గ్రహింపలేని
వేడిన – పొందెద – విలలో
దండిగ – దానియేలు – పొందెనహా
ఇదివరకు – మీరేమిలయున్
నాదు పేరట – అడుగ లేదనెన్
మీదు సంతోష – ము ఇలలో
అధికమగును – పొందిరి శిష్యులు
మనలో కార్య – సాధకమైన
తనశక్తి – చొప్పున క్రీస్తు చేయున్
మనమడిగినవాటి – కంటే ఎంతో
ఘనముగా చెరలో – పౌలు పేతురు గాంచె
ఊహించువా – టన్నిటి కంటె
సాహసకార్య – ములు ఎన్నో
ఊహకు మించె – నగ్నిగుండములో
ఆహాహా – నలుగురు – తిరుగుచునుండిరి
నా నిమిత్తము – జనులు నిన్ను
కాని మాటలెల్ల – పలుకునపుడు
నిన్ను శపించి – హింసించిన
కన్నులెత్తి – ప్రార్థించి – దీవించుమనె
నిశ్చయముగా – నేను నిన్ను
ఆశీర్వదింతు – నని పల్కె
నిశ్చయముగ – నభివృద్ధి జేసి
శాశ్వతముగా – తోడై యుందుననె
ఎన్ని శోధనలు – వచ్చిన
పెన్నుగా – ప్రార్థించు ప్రభుని
కన్నతండ్రి – నిన్ను విడువడు
సన్నుతించి – పాడు హల్లెలూయా
Dhaevuni praarThiMchedhamu – dhaiva puthruni naamamMdhu
adugudi – meeku – niththunanen
vedhakudi – meeku – dhorakudhunu
madhini – nammi – meeru – thattinachoa
mudhamuna – thalupu – theeyudhunane
gooDamaina – sMgathulilan
gaaDamai – neevu – grahiMpalaeni
vaedina – poMdhedha – vilaloa
dhMdiga – dhaaniyaelu – poMdhenahaa
idhivaraku – meeraemilayun
naadhu paerata – aduga laedhanen
meedhu sMthoaSh – mu ilaloa
aDhikamagunu – poMdhiri shiShyulu
manaloa kaarya – saaDhakamain
thanashakthi – choppuna kreesthu chaeyun
manamadiginavaati – kMtae eMthoa
ghanamugaa cheraloa – paulu paethuru gaaMche
oohiMchuvaa – tanniti kMte
saahasakaarya – mulu ennoa
oohaku miMche – nagniguMdamuloa
aahaahaa – naluguru – thiruguchunuMdiri
naa nimiththamu – janulu ninnu
kaani maatalella – palukunapudu
ninnu shapiMchi – hiMsiMchin
kannuleththi – praarThiMchi – dheeviMchumane
nishchayamugaa – naenu ninnu
aasheervadhiMthu – nani palke
nishchayamuga – nabhivrudhDhi jaesi
shaashvathamugaa – thoadai yuMdhunane
enni shoaDhanalu – vachchin
pennugaa – praarThiMchu prabhuni
kannathMdri – ninnu viduvadu
sannuthiMchi – paadu hallelooyaa