దేవుని ప్రేమఇదిగో – జనులారా భావంబునందెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక జీవంబు మనకబ్బును ||దేవుని||
సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండె – మన మీద జాలిపరుడై యుండెను ||దేవుని||
మానవుల రక్షింపను దేవుండుతన కుమారుని బంపెను మన
శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపములకు దూరుడే ||దేవుని||
యేసు క్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోస
కారిజనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు ||దేవుని||
పాపబారంబుతోడ నేప్రొద్దు – ప్రయాసములు బొందెడి
పాపులందురు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణ మిత్తుననెను ||దేవుని||
సత్తులైన పురుషులైనన్ – యాకర్త సర్వజనుల యెడలను
సత్ప్రేమగ నడిచెను – పరలోక సద్భోదలిక జేసెను ||దేవుని||
చావు నొందిక కొందరిన్ – యేసుండు – చక్కగ బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు – ప్రభునంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
గాలి సంద్రపు పొంగులన్ – సద్ధణపి – నీళ్లపై నడచినాడే
మేలుగల యద్భుతములు ఈలాగు వేలకొలదిగజేసెను ||దేవుని||
చేతుల కాళ్లలోనూ రా రాజు – చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వ లేకన్ ||దేవుని||
ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాపరులను
మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను ||దేవుని||
రక్షకుడు శ్రమబొందగా దేశంబు తక్షణము చీకటియ్యెను
రక్షకుడు మృతి నొందగా – తెర చినిగి – రాతి కొండలు పగిలెను|| దేవుని|
రాతి సమాధిలోను – రక్షకుని నీతిగల దేహంబును – పాతి
పెట్టిరి భక్తులు – నమ్మిన నాదలందఱు జూడగా ||దేవుని||
మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ ||దేవుని||
పదినొకండు మారులు వారలకు – ప్రత్యక్షుడాయెనేను
పరలోకమునకేగెను – తన వార్త ప్రకటించమని పల్కెను ||దేవుని||
నమ్మి బాప్తిస్మ మెందు – నరులకు – రక్షణ మరి కల్గును
నమ్మనొల్లక పోయెడు – నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని||
dhaevuni praemaidhigoa – janulaaraa bhaavMbunMdheliyarae
kaevalamu nammukonina
paraloaka jeevMbu manakabbunu ||dhaevuni||
sarvaloakamu manalanu thana vaakya sathyMbuthoa jaesenu
sarvoapakaaruduMde – mana meedha jaaliparudai yuMdenu ||dhaevuni||
maanavula rakShiMpanu dhaevuMduthana
kumaaruni bMpenu man
shareeramu dhaalchenu aa prabhuvu
mana paapamulaku dhoorudae ||dhaevuni||
yaesu kreesthunu paeruna rakShkudu velasinaadila loapala dhoas
kaarijanulathoa – neMthoa su – bhaaShlanu balkinaadu ||dhaevuni||
paapabaarMbuthoada naeprodhdhu – prayaasamulu boMdhedi
paapulMdhuru nammina – vishraaMthi
paripoorNa miththunanenu ||dhaevuni||
saththulaina puruShulainan
yaakartha sarvajanula yedalanu
sathpraemaga nadichenu
paraloaka sadhbhoadhalika jaesenu ||dhaevuni||
chaavu noMdhika koMdharin – yaesuMdu
chakkaga brathikiMchenu
sakala vyaaDhula roagulu – prabhunMti
svasThMbu thaa moMdhiri ||dhaevuni||
gaali sMdhrapu poMgulan – sadhDhaNapi – neeLlapai nadachinaadae
maelugala yadhbhuthamulu eelaagu vaelakoladhigajaesenu ||dhaevuni||
chaethula kaaLlaloanoo raa raaju
chaera maekulu boMdhenu
paathakulu gottinaarae parishudhDha
neethi thaamoarva laekan ||dhaevuni||
inni baaDhalu bettuchu – dhanu jMpu – chunna paaparulanu
manniMchumani thMdrini yaesuMdu sannuthithoa vaedenu ||dhaevuni||
rakShkudu shramaboMdhagaa dhaeshMbu thakShNamu cheekatiyyenu
rakShkudu mruthi noMdhagaa – thera chinigi
raathi koMdalu pagilenu|| dhaevuni|
raathi samaaDhiloanu – rakShkuni neethigala dhaehMbunu – paathi
pettiri bhakthulu – nammina naadhalMdhaRu joodagaa ||dhaevuni||
moodava dhinamMdhuna yaesuMdu mruthi gelchi laechinaadu
naadu nammina manujulu – choochiri
naluvadhi dhinamulMdhun ||dhaevuni||
padhinokMdu maarulu vaaralaku – prathyakShudaayenaenu
paraloakamunakaegenu
thana vaartha prakatiMchamani palkenu ||dhaevuni||
nammi baapthisma meMdhu – narulaku – rakShNa mari kalgunu
nammanollaka poayedu – narulaku narakMbu sidhDhamanenu ||dhaevuni||