Ee jaathilo memu okarimey ఈ జాతిలో మేము ఒకరిమే

ఈ జాతిలో మేము ఒకరిమే
మన దేశమును ప్రేమిస్తున్నాం
నిజ స్వేచ్ఛకై ప్రార్ధిస్తున్నాం
క్రీస్తుకై బ్రతుకుచున్నాం

జనగణమునకై ప్రతిజాతికై
నిరంతరం ప్రార్ధిస్తున్నాం
మా దేశముకై ప్రతిపౌరునికై
మరింతగా ప్రార్ధిస్తున్నాం

వందేమాతరం మాతరం
యేసుదే ఈ తరం
వందేమాతరం మాతరం
యేసుకే అంకితం

నీతిని భోదించే సేవకులను
హింసించేవారికై ప్రార్ధిస్తున్నాం
సువార్తను మతమని తలచి క్రీస్తు ప్రేమను
నిందించేవారికై ధుఃఖిస్తున్నాం
దూషించినా ద్వేషించినా
క్రీస్తు ప్రేమనే ప్రకటిస్తున్నాం
బాధించినా గాయపరచినా
కల్వరి ప్రేమనే చూపిస్తున్నాం
దేవా నా దేశమును రక్షించవా
దేవా నా జాతిని దర్శించవా

కులమత ద్వేషములు విద్రోహచర్యలు
నశియించిపోవుటకే ప్రార్ధిస్తున్నాం
ఉగ్రవాద దాడులు అంధకార ఆలోచనలు
అంతరించిపోవుటకై ప్రార్ధిస్తున్నాం
సుఖజీవము సౌభాగ్యము
దేశములో ఉండాలని కోరుచున్నాం
ఆనందము అనురాగము
దేశములో ఉండుటకై ఆశిస్తున్నాం
దేవా నా దేశమును రక్షించవా
దేవా నా జాతిని దర్శించవా


Ee jaathilo memu okarimey
mana dhesamunu premisthunnaam
nija swechakai praardhisthunnaam
kreesthukai brathukuchunnaam

janaganamunakai prathijaathikai
nirantharam praardhisthunnaam
maa dhesamukai prathi pourunikai
marinthagaa praardhisthunnaam

vande maatharam maatharam
yesudhe ee tharam
vande maatharam maatharam
yesuke ankitham

neethini bhodinche sevakulanu
himsinchevaarikai praardhisthunnaam
suvaarthanu mathamani thalachi kreesthu premanu
nindhinchevaarikai dhukkisthunnaam
dhooshinchinaa dhweshinchinaa
kreesthu premaney prakatisthunnaam
baadhinchinaa gaayaparachinaa
kalvari premaney choopisthunnaam
devaa naa dhesamunu rakshinchavaa
devaa naa jaathini dharsinchavaa

kulamatha dhweshamulu vidhrohacharyalu
nasiyinchipovutakey praardhisthunnaam
ugravaadha dhaadulu andhakaara aalochanalu
antharinchi povutakai praardhisthunnaam
sukhajeevamu saubhaagyamu
dhesamulo undaalani koruchunnaam
aanandhamu anuraagamu
dhesamulo undutakai aasisthunnaam
devaa naa dhesamunu rakshinchavaa
devaa naa jaathini dharsinchavaa


Posted

in

by

Tags: