Ellappudunu Prabhuvunandu
ఎల్లప్పుడును ప్రభువునందు

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి (2)
ఆరాధించండి [ఎల్లప్పుడును]

పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
మనకై తన ప్రాణం అర్పించెగా (2)
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే [ఎల్లప్పుడును]

విశ్వాసమునకు కలిగే పరీక్ష
ఓర్పును కలిగించే ఒక సాధనమై
శోధనకు నిలిచి సహించిన వేళ
జీవ కిరీటమును పొందెదము (2)
నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి
సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి [ఎల్లప్పుడును]

ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి
మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి
మనతో నివాసమును కలిగి యుండుటకు
త్వరలోనే రారాజుగా రానైయుండె (2)
శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి
సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి [ఎల్లప్పుడును]


Ellappudunu Prabhuvunandu Aanandinchandi
Prathi Samayamulonu…
Prathi Paristhithilonu Aanandinchandi (2)
Yehovaa Chesina Melula Korakai
Ellappudunu Aanandinchandi (2)
Aaraadhinchandi [Ellappudunu]

Paapambu Thoda Chinthinchuchunda
Narunigaa Ee Bhuvilo Udayinchegaa
Mana Paapa Bhaaram Thana Bhujamuna Mosi
Manakai Thana Praanam Arpinchegaa (2)
Uchithaardhamaina Rakshananu Nosagi Neethimanthuni Chesi
Ullaasa Vasthramunu Dhariyimpajesi Yunnaadu Ganuke [Ellappudunu]

Vishwaasamunaku Kalige Pareeksha
Orpunu Kaliginche Oka Saadhanamai
Shodhanaku Nilichi Sahinchina Vela
Jeeva Kireetamunu Pondedamu (2)
Naanaa Vidhaalaina Shodhanalo Padinappudu Aanandinchandi
Sampoornulugaanu Koduve Leni Orpunu Konasaaginchandi [Ellappudunu]

Prathi Baashpa Binduvunu Thudichi Vesi
Maranamu Dukhamu Edpunu Dooramu Chesi
Manatho Nivaasamunu Kaligi Yundutaku
Thvaralone Raaraajugaa Raanaiyunde (2)
Shubhapradamainaa Nireekshanatho Kaachiyundandi
Siddhamaina Manassunu Kaligi Vechiyundandi [Ellappudunu]


Posted

in

by

Tags: