ఎంత దీనాతి దీనమో… ఓ యేసయ్యా //2//
నీ జనన మెంత దయనీయమో….
తలచుకుంటె నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది! //ఎంత//
నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా //2//
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా //ఎంత//
నిండు చూలాలు, మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా //2//
దిక్కుతోచక ఓ యేసయ్యా పశులపాకలో ప్రసవించెనయ్యా //ఎంత//
చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలిపుట్టెనయ్యా //2//
పసికందువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా //ఎంత//
Enta deenaatideenamo… O Yesayyaa //2//
Nee jananamenta dayaneeyamo…
Talachukunte naa gunde tadabadi
taragi karigi neeraguchunnadi! //Enta//
Nee srustilo ee lokame neevu maaku ichhina satramayyaa //2//
Aa satramulo O Yesayya neeku sthalame dorakaledayya //Enta//
Nindu choolaalu Mariyamma talli Nadavaleka sudivadipoyenayyaa //2//
Dikkutochaka o Yesayyaa – Pashulapaakalo prasavinchenayya //Enta//
Challagaalilo chaatuleka nalumoolala chaliputtenayya //2//
Pasikanduvai o Yesayya Tallivodilo odiginaavayya //Enta//