ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్
ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము
లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ||
అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము
ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితి
ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ||
అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్
మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులు
గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ||
దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో
భావమందున నీపదంబుల సేవ బాగుగఁ జేయుచున్ నీ జీవజల
వాక్యంబులన్ ధర ధీరతనుఁ బ్రకటింపఁ జేయుము ||ఘనదేవ||
పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము
సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర
ప్రియుల సమితిని మరియుఁ జేర్చుము నీ సభలలో ||ఘనదేవ||
కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబలఁ జేయుమా
సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా
పరమార్ధములు బా లురకు గరవుచునుండఁ జేయుము ||ఘనదేవ||
భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా దాసబృందములన్ గావు వాసిగా
నరలోకము నని వాసులగు మీ దాసులందరి దోషరాసిని ద్రోసి నీ కృప
జూపుచును రక్షించు మనిశము ||ఘనదేవ||
Ghanadhaeva priya thanayuMdaa jagadhrakShaa
vinuthi jaethumu nee mahiman
ghanatharMbuga gatha sMvathsara dhinamu
lannita maaku neebhuvi ghanasukhamu
lonariMchi mari noothanapu vathsara
mosaginMdhuku ||ghanadhaeva||
adhika praemalosAOgumu yaesu prabhu
kudhuruga nee vathsaramu
praDhama dhinamuna mammu nMdhari mudhamuthoa
nichchatakuAO jaerchithi
prabalamagu sMgeethasthuthulanu migulaboMdhumu
yaesu rakShka ||ghanadhaeva||
amchithamuga nichchatan goodina sabhaloa
sthreelan buruShula biddalan
mMchi maargamunuMchi nee yathyMtha praemathoaAO
gaavu milanu chMchalulu
gaakuMda nee krupa luMchi mamu rakShiMchumoa
prabhu ||ghanadhaeva||
dheeviMchu prabhuyaesuvaa suvaarthikulan
saavaDhaanamugaa bhuviloa
bhaavamMdhuna neepadhMbula saeva baagugAO
jaeyuchun nee jeevajala
vaakyMbulan Dhara DheerathanuAO brakatiMpAO
jaeyumu ||ghanadhaeva||
paramuMda Dhara nee sabhalan noothanamuga
sthiraparchi balaparchumu
sarasamuga naasheervachanamu lvirivigaa
nosmguchun noo thana sahoadhara
priyula samithini mariyuAO jaerchumu
nee sabhalaloa ||ghanadhaeva||
karunaaLa yeevathsaramu kraisthava
badula DharaNibrabalAO jaeyumaa
sariga nupaaDhyaayulMdhari mari maree
dheeviMchu prabhuvaa sThiramugaa
paramaarDhamulu baa luraku garavuchunuMdAO
jaeyumu ||ghanadhaeva||
bhaasurMbuga paraloaka prakaashuAOdaa
dhaasabruMdhamulan gaavu vaasigaa
naraloakamu nani vaasulagu mee dhaasulMdhari
dhoaShraasini dhroasi nee krupa
joopuchunu rakShiMchu manishamu ||ghanadhaeva||