జగమంత దివ్యకాంతితో
ప్రకాశించే క్రీస్తు జన్మతో
దేవుడే మానవుడై
మన మధ్య నివసింప
ప్రేమానురాగాలు పంచగా ఇలలో
పాపులను రక్షింప
ప్రాణమునే అర్పింప
పావనుడే ఈ భువికి వచ్చు వేలలో
చీకటి నిండిన పాపము పండిన
లోకమునెంతో ప్రేమించెను
త్రోవ తప్పిన దేవుని విడచిన
పాపిని యెంతో క్షమియించెను
లోకపాపములు మోయు గొర్రెపిల్లగా క్రీస్తు
శిలువలో మరణించి పాపమునే తొలగించె
లోకమును వెలిగించ క్రొవ్వత్తుల కరిగి
బ్రతుకులో చీకటిని పారద్రోలెనే
వేవేల కాంతులతో
నిండెను బ్రతుకంతా
శ్రీ యేసు జన్మించగా
ఈ లోకానికే పండుగ
ఆజ్ఞాతిక్రమమే పాపమాయెను
నిత్య మరణానికి దారి తీసెను
దేవుని కృపలో క్రీస్తు నందు
నిత్య జీవము అనుగ్రహించెను
నశియించే వారిని వెదకి రక్షించుటకు
అరుణోధయ తారయై ఉదయించెను
విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొంద
జీవహారమై దిగి వచ్చెను
మరణపు ముళ్ళు విరిచెను
పరలోకము చేర్చెను
శ్రీ యేసు దరికి చేరగా
విశ్వాసముంచి నీవు కొలువగ
Jagamantha divyakaanthitho
prakaasinche kreesthu janmatho
dhevude maanavudai
mana madhya nivasimpa
premaanuraagaalu panchagaa ilalo
paapulanu rakshinpa
praanamune arpinpa
paavanude ee bhuviki vachu velalo
cheekati nindina paapamu pandina
lokamunentho preminchenu
throva thappina dhevuni vidachina
paapini yentho kshamiyinchenu
lokapaapamulu moyu gorre pillagaa kreesthu
siluvalo maraninchi paapamune tholaginche
lokamunu veligincha krovvaththula karigi
brathukulo cheekatini paaradrolene
vevela kaanthulatho
nindenu brathukanthaa
sree yesu janminchagaa
ee lokaanike panduga
aagnaathikramame paapamaayenu
nitya maranaaniki dhaari theesenu
dhevuni krupalo kreesthu nandu
nithya jeevamu anugrahinchenu
nasiyinche vaarini vedaki rakshinchutaku
arunodhaya thaarayai udayinchenu
viswasinchu prathivaadu nithya jeevamu pondha
jeevahaaramai dhigi vachenu
maranapu mullu virichenu
paralokamu cherchenu
sri yesu dhariki cheragaa
viswaasamunchi neevu koluvaga