kaanaapurmbuloaao gadu vimthagaa neeru కానాపురంబులోఁ గడు వింతగా నీరు

కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి
పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||

రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు
హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత
భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా||

దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు
తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము
లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||

ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన
నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా
నెరవేర్పు గూడ నుండు ||కానా||

చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు
డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు
కరుణానిధీ ||కానా||

పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు
జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప
శక్తి నిమ్ము ||కానా||


kaanaapurMbuloaAO gadu viMthagaa neeru
jaanugaa dhraakShrasamunu jaesi
paanamugAO beMdliloa baagugaa nichchina
dheena rakShka beMdli dheeviMchumee ||kaanaa||

raavayya peMdliki rayamugaa noa yaesu eevu liyyAOga vachchu
hithuni boali kaavu meedhvMdhvamunu ghanamaina krupachaetha
bhaavamaalinyMbuAO baapi yipudu ||kaanaa||

dhaya nuMchu mayya yee dhMpathulameeAOdha
dhayuAOdavai kaapaadu
thMdri valenu niyamMbugaa veeru
nee chiththamunu jaripi bhayamu
laekuMda ga brathuka nimmu ||kaanaa||

oppu meerAOgAO jaeyu noppMdhamu
veera leppudunu madhiloana
nidikonuchunu dhappakuMdAOga dhaani
nippudamiloa nepudu goppagaa
neravaerpu gooda nuMdu ||kaanaa||

chakkAOgaa negadiMpa sMsaara bhaarMbu
nekku vagu nee yaathma nipu
dosMgi nikka magu saraNiloa nekkuvaga
nadipiMchi krakku nanu dheeviMchu
karuNaaniDhee ||kaanaa||

pillalanu neevosAOgAO briyamuthoa noa
dhaeva pellugaa boaDhiMpa veravu
joopu mella vaeLalaloana niruku maargamu
nMdhu jallAOgaa nadipiMpa
shakthi nimmu ||kaanaa||


Posted

in

by

Tags: