కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో
సరియైన త్రోవలోకి నడిపించుము
నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము
ఏమి చేయను ఏలా చేయను
తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2)
నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు
నీ పాదములందు ఉండును నాదేవా ||కన్నీటి||
విన్నవించలేను నిన్ను స్తుతించలేను
కట్టబడి చెరసాలలో వున్నాను
నా శ్రమలను తీర్చుము నా దేవా
ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య ||కన్నీటి||
జారిపోయాను మనస్సు పగిలియున్నాను
శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను
నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య
నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా ||కన్నీటి||
Kanneeti baadhanu viduchuchunna nee sannidhilo
sariyaina throavaloaki nadipinchumu
nannu sariyaina throavaloaki nadipinchumu
Aemi chaeyanu aelaa chaeyanu
theliyakanae kanneetiloa jeevisthunnaanu (2)
nee sannidhi choopi nadipinchu naaprabhu
nee paadhamulandhu undunu naadhaevaa ||kanneeti||
Vinnavinchalaenu ninnu sthuthinchalaenu
kattabadi cherasaalaloa vunnaanu
naa shramalanu theerchumu naa dhaevaa
prathi samayamuloa nee krupaloa jeevinthunayya ||kanneeti||
Jaaripoayaanu manassu pagiliyunnaanu
shaanthi vidichi krungi naligi yunnaanu
naa hasthamu patti laevaneththu yaesayy
nee karuna choopi nadipimchu praemamayyaa ||kanneeti||