Karunaa karudaa కరుణా కరుడా

కరుణా కరుడా – నీ మార్గము – పరిశుద్ధ స్థలములో గలదు – అది

యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు – వారు
తిరిగి వచ్చెదరు సీయోనునకు

చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ – తమ
సంతోషం అధికంబగును

మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు – తమ
దుఃఖం నిట్టూర్పును పోవును

విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి – తమ
ప్రభుని కొనియాడిరి బహుగా

ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు
ప్రవిమల నీతి సమాధానం – అది – పరిశుద్ధాత్మానందము

మహోన్నతుడే మనకానందం
మహా బలము కలుగును గాక – అది మహిమార్థంబగును గాక

హల్లెలూయ ఎల్లరుపాడి
హర్షింతుము ప్రభుయేసునిలో – మన రక్షకుడేసుని పాడెదము


Karunaa karudaa – nee maargamu
Parishudhdha sthalamuloa galadhu – adhi

Yehoavaa vimoachinchina vaaru paatalu paaduchu – vaaru
Thirigi vachchedharu seeyoanunaku

Chakkaga vaari thalalameedha shaashvathanandhamu kalugun
Tham Santhosham adhikambagu

Moakshaanandha bhaagyamugaligi akshyulai arudhenchedharu
tham dhuhkham nittoorpunu poavunu

Viriviga shishyulanandhamuthoa parishudhdhaathmathoa nindi
Tham prabhuni koniyaadiri bahugaa

Prabhu raajyamu thini thraaguta kaadhu
Pravimala neethi samaadhanam – adhi parishudhdhaathmaanandhamu

Mahoannathudae manakaanandham
Mahaa balamu kalugunu gaaka – adhi mahimaarthanbagunu gaak

Hallelooya ellarupaadi
Harshinthumu prabhuyaesuniloa – mana rakshkudaesuni paadedhamu


Posted

in

by

Tags: