క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ
సిలువశక్తి జాటవేమయ్యా యెండవానలనియు జడిసి
ఎంతకాలము మూలనుందువు కండలను ప్రేమింతువేమన్నా
ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ||
వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు వివక్షుద్భాధకొని
వాంఛించుచుండగను మిషనులెల్లను మిషలచేత
మిట్టిపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా
నీవెంతకాలము వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవ||
సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల
బత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల
బోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారుల
జేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము
చాట రావయ్యా ||క్రైస్తవ||
శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని
పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట
మనస్సు బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు
సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవ||
నీతికై భక్తాదిపరులెల్ల నిజవిశ్వాసము నిలుపుకొన
పోరాడిరే చాలకత్తిపోటులు రాళ్ళదెబ్బలు కరకు గల
రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు పైబడి
చీలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవ||
ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి
చెలరేగి గర్వించి ఆదిక్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి
తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘ మెచ్చె
అధిపతి అప్పుడె నశియించె ||క్రైస్తవ||
దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుండా ఖ్యాతిగా
నీ కిచ్చె గ్రంథంబు భీతియేల తినుము గ్రంథము తేనెవలె
మధురముగ నుండున జ్ఞానము నీకబ్బునో హితుడ
జ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుండా ||క్రైస్తవా||
KraisthavuNdaa kadhiliraavayyaa kaluShaathmulaku yee
Siluvashakthi jaatavaemayyaa yendavaanalaniyu jadisi
Yenthakaalamu moolanundhuvu kandalanu praeminthuvaemannaa
Ee mattikandalu entha benchina mattikaenannaa ||kraisthava||
Vasudhaloa prajalellaru yaesu vaakyambu vivakshudhbhaadhakoni
Vaanchinchuchundaganu mishnulellanu mishlachaetha
Mittipaduchu vaadhamulathoa yaesu boadhanu vidachinaarannaa
Neeventhakaalamu vaarichentha nundhuvoaranna ||kraisthava||
Sathyavaakyamu santhaloadhulipi boadhakulu dhorala
Bathyamulapai bhraanthulu nilipi chithramagu anukoola
Boadhalu chaesi brajalanu moasaginchu soothradhaarula
Jaera raadhayyaa sukhabhoagamidichi sathyavaakyamu
Chaata raavayyaa ||kraisthava||
Shakthiheenudanndhu vaemayyaa saujanyamagu shudhdhaathmashakthini
Pondhukonumayyaa bhakthiheenatha paaradhroalu bhrashta
Manassu bayaluparachu shakthikalugu suvaartha chaatudhuvu
Suvaartha chaeya jayamondhi aathmalanu rakshimchedhavu ||kraisthava||
Neethikai bhakthaadhiparulella nijavishvaasamu nilupukona
Poaraadirae chaalakaththipoatulu raaLLadhebbalu karaku gala
Rampamulu koathalu beththamulu koradaala dhebbalu paibadi
Cheeli dhaehamu vaalalaadenu rakthamu bhuvipai ||kraisthava||
Aadhi sanghamu naarputaku nenchi aa dhushta neeroa adhipathi
Chelaraegi garvinchi aadhikraisthava bhakthula sthambhamula gatti
Thaarupoosi agnini muttinchi kaalvanga aa sanga mechche
Adhipathi appude nashiyinche ||kraisthava||
Dhoothalaku laenatti paricharya oa priya sakhundaa khyaathigaa
Nee kichche grandhambu bheethiyaela thinumu grandhamu thaenevale
Madhuramuga nunduna jnyaanamu neekabbunoa hithuda
Jnyanambunondhi svaamini saevinchumoa sakhundaa ||kraisthavaa||