Kreesthaesu siluvapai క్రీస్తేసు సిలువపై

క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి – ఆయన కృపయందే నిలుచుండుము
పరలోక మహిమ కిరీటముకై – క్రీస్తేసు అడుగులలో నడువుము
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచు

సమాదాన దేశం పరలోకము – ఎన్నో దీవెనలు కలవందున
ఇహలోక శాంతి క్షణమాత్రమే – గొప్ప శిక్ష యందు దాగియుండె

క్రీస్తు నుండి నిన్ను దూరపరచ – లోకాశలు నిన్ను ఆకర్షించు
సిలువను చూడక పోయినచో – చిక్కుకొనెదవు ఈ లోకములో

ప్రభుయేసు సహవాసమున నిలిచి – సాతానుకు స్థలమియ్యకుము
ఏవి క్రీస్తునుండి విడదీయునో – యేసు రక్తమందు కడుగుకొనుము

పరలోక దీవెనలు రుచిచూడను – ఆశతో వెళ్ళను సిద్ధపడు
లోకమునకు నీవు వేరైనచో – ఆత్మీయముగ నీవు యెదిగెదవు


Kreesthaesu siluvapai dhrushtinunchi
aayana krupayandhae niluchundumu
Paraloaka mahima kireetamukai
kreesthaesu adugulaloa naduvumu
Kreesthaesu siluvapai dhrushtinunchu

Samaadhaana dhaesham paraloakamu
ennoa dheevenalu kalavandhuna
Ihaloaka shanthi kshnamaathramae
goppa shiksh yandhu dhaagiyunde

Kreesthu nundi ninnu dhooraparacha
loakaashalu ninnu aakarshinchu
Siluvanu choodaka poayinachoa
chikkukonedhavu ee loakamuloa

Prabhuyaesu sahavaasamuna nilichi
saathaanuku sthalamiyyakumu
Aevi kreesthunundi vidadheeyunoa
yaesu rakthamandhu kadugukonumu

Paraloaka dheevenalu ruchichoodanu
aashathoa vellanu sidhdhapadu
Loakamunaku neevu vaerainachoa
aathmeeyamuga neevu yedhigedhavu


Posted

in

by

Tags: