క్రీస్తు మహిమకే మా ప్రాణం మా జీవం మా సర్వం
లోకము మరచి పాడెదము స్తుతి గీతం కలకాలం
చప్పట్లతో తాళాలతో నాట్యముతో కొనియాడెదం
తప్పెట్లతో భజనలతో శాంతి సువార్తను ప్రకటించెదమ్
అడుగులు తడబడు వేళ
జారనీయక నిలిపి ఇక్కట్టులో
దరి చేరి వ్యథను తీర్చాడు
ఈ సామర్థ్యమెవరికి లేదు
ధర ఎవరికి సాధ్యము కాదు
ఏది ఏమైనను నే యేసయ్యనే
స్తుతి గళమెత్తి మనసారా భజియింతుము
ఆత్మీయ పోరాటమును మాకు నేర్పిన గురువు
పోరాడువాడు తానై జయమునిచ్చాడు
మాకు మెళుకువ నేర్పువాడు ప్రార్థనాయుధమును ఇచ్చాడు
నాశనమవ్వని జీవకీరింటము నాకు
తప్పక బహుమతిగా అందించును
Kristu mahimake ma pranam ma jivam ma sarvam
Lokamu marachi padedamu stuti gitam kalakalam
Chappatlato talalato natyamuto koniyadedam
Tappetlato bajanalato samti suvartanu prakatimchedam
Adugulu tadabadu vela
Jaraniyaka nilipi ikkattulo
Dari cheri vyathanu tirchadu
I samarthyamevariki ledu
Dhara evariki sadhyamu kadu
Edi emainanu ne yesayyane
Stuti galametti manasara bajiyimtumu
Atmiya poratamunu maku nerpina guruvu
Poraduvadu tanai jayamunichchadu
Maku melukuva nerpuvadu prarthanayudhamunu ichchadu
Nasanamavvani jivakirimtamu naku
Tappaka bahumatiga andinchunu