మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా
నగమ నెక్కెను రా ||మా యేసు||
ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టిని
నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములు
వీడు జాడఁ గన్గొనెరా ||మా యేసు||
సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు
వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు
వేల్పు ల్విష మైరిగదా ||మా యేసు||
బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ మంత్రము లన్ని
కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి
ప్రభుక్రీస్తు శరణుఁ జొచ్చెనురా ||మా యేసు||
మతిలోని లోఁతు మ ర్మము గానఁబడెరా మితలేని ఘనపాప మే
నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుఁడురా మృతిచేత మన
పాప వితతి గొట్టెనురా ||మా యేసు||
కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁ దెగెరా బలవత్పిశాచ శృం ఖలము
విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన
నిలచి యున్నదిరా ||మా యేసు||
తనపోల్కె నొరులఁ గ న్గొనఁ బ్రేమయ్యెనురా మనసు దేవునికి న
ర్పణ సేయఁ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు
మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా ||మా యేసు||
Maa yaesu kreesthuni maruaogu
galgenuraa naa yaathma ghanarakshaa
nagama nekkenu raa ||maa yaesu||
mumdhu naaloa paapa mulu joodao
baderaa demdhamu thaa nanni tini
noppukoneraa ymdhukai balu dhuhkha
maathmao jemdhenuraa smdhaehamulu
veedu jaadao gangoneraa ||maa yaesu||
suvishaesh boadhanaa chevu laalimchenuraa
avivaeka shaasthroakthu lmtu
veedenuraa navasathkraisthava goashti
bhuvi naa kabbenuraa vividhamu lagu
vaelpu lvish mairigadhaa ||maa yaesu||
baadhaguruvula moamu lbahu lajjaobaderaa
gaadha mmthramu lanni
kadagmdlayi chederaa shoadhimchi naayaathma
shudhdhigoarenuraa saadhimchi
prabhukreesthu sharanuao jochchenuraa ||maa yaesu||
mathiloani loaaothu ma rmamu gaanaobaderaa
mithalaeni ghanapaapa mae
nimdu koneraa hithamugaa thana jeeva michche
kreesthuaoduraa mruthichaetha mana
paapa vithathi gottenuraa ||maa yaesu||
kulagoathramula budhdhi kutilmbuao
dhegeraa balavathpishaacha shrum khalamu
virigenuraa siluva moasinavaani chira
saukhyoannathiraa nelavuga naaloana
nilachi yunnadhiraa ||maa yaesu||
thanapoalke norulao ga ngonao
braemayyenuraa manasu dhaevuniki na
rpana saeyao baderaa ghana krupashaamthulu
gonenu nemmadhiraa manasu
maarpadi moaksh mahima gangoneraa ||maa yaesu||