మాకనుగ్రహించిన దైవ వాక్యములచే
మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా
రక్షణ నొందిన వారికి దేవుడు
ఒసగిన శక్తిని యెరిగి జీవింతుము
రక్షణ కృపలు ప్రభువిచ్చినవే
అతిశయింపలేము అంతయు కృపయే
అమూల్యమైన సిలువశక్తిచే
ఖాళీయైన మమ్మును నింపె
పాప మృతులమైన మమ్మును లేపెను
ప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెను
పరలోక పదవి పాపులకిచ్చె
పునరుత్థాన శక్తిచే కలిగె
మరణ పునరుత్థాన మందైక్యతచే
బలాతిశయమున్ పొందెదము
విశ్వసించు మనలో తన శక్తి యొక్క
మితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము
సర్వాధికారము ఆధిపత్యముల కంటె
శక్తి ప్రభుత్వము లన్నిటికంటే
అన్ని నామములలో హెచ్చింపబడిన
యుగ యుగములలో మేలైన నామమున
తనశక్తిని బయలుపరచుటకు
ఏర్పరచుకొనెను బలహీనులను
ఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకు
నీచులైనవారిని ఏర్పరచుకొనెన్
యుద్ధోపరణముల్ ఆత్మీయమైనవి
మానక ప్రభువు విధేయులమగుటే
దుర్గములన్నిటిన్ పడగొట్టు నదియే
ప్రభు యేసు నొసగిన భాగ్యము యిదియే
Maakanugrahimchina dhaiva vaakyamulachae
maa manoanaethramulu veligimpumayyaa
rakshna nomdhina vaariki dhaevudu
osagina shakthini yerigi jeevimthumu
rakshna krupalu prabhuvichchinavae
athishayimpalaemu amthayu krupayae
amoolyamaina siluvashakthichae
khaaleeyaina mammunu nimpe
paapa mruthulamaina mammunu laepenu
praemathoa mammu prabhuthoanae laepenu
paraloaka padhavi paapulakichche
punaruthThaana shakthichae kalige
marana punaruththaana mmdhaikyathachae
balaathishayamun pomdhedhamu
vishvasimchu manaloa thana shakthi yokk
mithilaeni mahaathmyamu thelisikonedhamu
sarvaadhikaaramu aadhipathyamula kante
shakthi prabhuthvamu lannitikmtae
anni naamamulaloa hechchimpabadin
yuga yugamulaloa maelaina naamamun
thanashakthini bayaluparachutaku
aerparachukonenu balaheenulanu
ennikainvaarini vyarThaparachutaku
neechulainavaarini aerparachukonen
yudhmhoaparaNamul aathmeeyamainavi
maanaka prabhuvu vimhaeyulamagutae
dhurgamulannitin padagottu nadhiyae
prabhu yaesu nosagina bhaagyamu yidhiyae