మాయ లోకము – మోసపోకుము
యేసునందే రక్షణ దొరుకును నీకు
బంధుమిత్రులు – భార్య బిడ్డలు – ధనము ఘనము అందచందము
అవి అన్నియును – నీటిబుడగలె సమాధితోనే – సమాప్తమౌను
పడగ విప్పిన – పామువలె నీ – పాపము నిన్ను వెంబడించును
పాప ఫలితము – మరణమేగదా దాని అంతము నిత్యనరకము
నిన్ను రక్షింపనెంచి ప్రభువు – పరమును విడచి – ధరకువచ్చెను
నీకు బదులుగా – శ్రమల నోర్చెను – సిలువలోనే బలియాయె నేసు
ఇప్పుడైనను – ఒప్పుకొనుమిక – నీ పాపజీవితము నంతయు
నిన్ను క్షమించును కృపతో ప్రభువు – ఇదియే నీ రక్షణ దినముగా
దేహమంత ప్రభు గాయముల్ పొందె – పరిశుద్ధ రక్తమును
కార్చెను – నిత్యజీవము నీకు నీయను – మృతిని గెల్చి తిరిగిలేచెను
Maaya loakamu – moasapoakumu
yaesunmdhae rakshna dhorukunu neeku
Bandhumithrulu – bhaarya biddalu –
Dhanamu ghanamu amdhachmdhamu
avi anniyunu – neetibudagale
samaadhithoanae – samaapthamaunu
Padaga vippina – paamuvale nee –
paapamu ninnu vembadimchunu
paapa phalithamu – maranamaegadhaa
dhaani amthamu nithyanarakamu
Ninnu rakshimpanemchi prabhuvu
paramunu vidachi – dharakuvachchenu
neeku badhulugaa – shramala noarchenu
siluvaloanae baliyaaye naesu
Ippudainanu – oppukonumika –
nee paapajeevithamu nanthayu
ninnu kshmimchunu krupathoa prabhuvu –
idhiyae nee rakshna dhinamugaa
Dhaehammtha prabhu gaayamul pomdhe –
parishudhdha rakthamunu
kaarchenu – nithyajeevamu neeku neeyanu –
mruthini gelchi thirigilaechenu