మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను
ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు
రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు ||మేఘంబు||
యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే
భూదిగంతము వరకు మీరు భూరి
సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య
విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబు||
గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు
వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు
నా ప్రభువట్లెమరల యలర వచ్చుట
మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె ||మేఘంబు||
శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును
యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు
రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే ||మేఘంబు||
Maeghmbupai nekki maeluga prabhu
kreesthu yaakasmbuna kaegenu
praakatamuganu aathmanmdhi prajny meeraga
saakshyamichchi yaeka dheekshnu yaesu
raakaku nedhuru joodudatmchu prabhuvu ||maeghmbu||
Yoodhayya samarayya praamthmbulmthata
naadhu vaarthanu jaatarae
bhoodhigmthamu varaku meeru bhoori
saakshulaguchu naaku saadharmbuga sathya
vishvaa smbulan manudmchu prabhuvu ||maeghmbu||
Galilayyulaara mee raashathoa nemdhuku
thilakimchu chunnaaratlu
velayaparamuna ketlu naegeno yilaku naa
prabhuvatlemarala yalara vachchuta
meeru gaamchedha rmchu dhoothalu balkirapude ||maeghmbu||
Shree smgha midhivinu maa yaesu prabhu
kreesthae bhaasilla mari vachchunu
yaesu prabhuni yadugu jaadala yaepu
meeraga nadachu konuchu neesu
rakshna nilakujaatuchu nedhuru joodumu yaesu korakae ||maeghmbu||