Mana balamaina మన బలమైన

మన బలమైన యాకోబు దేవునికి
గానము సంతోషముగా పాడుడీ

పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి
సితార స్వరమండలము వాయించుడి

అమావాస్య పున్నమ పండుగ దినములందు
కొమ్మునూదుడి యుత్సాహముతోడ
యాకోబు దేవుడు నిర్ణయించిన – ఇశ్రాయేలీయుల కది కట్టడ

తానైగుప్తులో తిరిగినప్పుడు – యోసేపు సంతతికి సాక్షముగ
నిర్ణయించెను దేవుడు అచ్చట – నే నెనుగని భాషను నే వింటిని

తమభుజము నుండి బరువు దింపగ మోతగంపల భారము దప్పెను
నీవాపదయందు మొఱపెట్టగా – విడిపించిన యెహోవాను నేనే

ఉరుము దాగుచోటులో నుండినే – ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని
మెరీబా జలముల యొద్ద నిన్ను – నా ప్రజలారా నా మాట వినుడి

ఇగుప్తు దేశములో నుండి నిన్ను – రప్పించిన యెహోవా దేవుడను
నీవు నీ నోరు బాగుగా తెరువుము – నేను నింపెదను మంచి వాటితో

అతి శ్రేష్ఠమైన గోధుమలను – అనుగ్రహించి పోషించెద నిన్ను
కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో – తృప్తి పరచెదను నిత్యముగా

అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట – వినిన పక్షాన ఎంత మేలగు
అన్యదేవతల నెవ్వరికిని – నీవు ఎన్నడు పూజ చేయరాదు


Mana balamaina yaakoabu dhaevuniki
gaanamu smthoaShmugaa paadudee

Paatalu paadi gilaka thappeta kottudi
sithaara svarammdalamu vaayimchudi

Amaavaasya punnama panduga dhinamulmdhu
kommunoodhudi yuthsaahamuthoad
yaakoabu dhaevudu nirNayimchina
ishraayaeleeyula kadhi kattad

Thaanaigupthuloa thiriginappudu
yoasaepu smthathiki saakshmug
nirnnayimchenu dhaevudu achchata
nae nenugani bhaaShnu nae vimtini

Thamabhujamu numdi baruvu dhimpaga
moathagmpala bhaaramu dhappenu
neevaapadhaymdhu moRapettagaa
vidipimchina yehoavaanu naenae

Urumu dhaaguchoatuloa numdinae
uththaramichchi ninnu shoadhimchithini
mereebaa jalamula yodhdha ninnu
naa prajalaaraa naa maata vinudi

Igupthu dhaeshamuloa numdi ninnu
rappimchina yehoavaa dhaevudanu
neevu nee noaru baagugaa theruvumu
naenu niMpedhanu manchi vaatithoa

Athi shraeshtamaina goadhumalanu
anugrahimchi poashimchedha ninnu
komda thaenenichchi kadu praemathoa
thrupthi parachedhanu nithyamugaa

Ayyoa ishraayaelu neevu naa maata
vinina pakshaana emtha maelagu
anyadhaevathala nevvarikini – neevu ennadu pooja chaeyaraadhu


Posted

in

by

Tags: