Mana dhaevuni మన దేవుని పట్టణమందాయన

మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు

ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతము
ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది

దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడు
రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి

అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ – వేదన పట్టెను
తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల – పగులగొట్టుచున్నావు

సైన్యము లధిపతి యెహోవా దేవుని – పట్టణమునందు
మనము వినినట్టి రీతిగా జరుగుట – మనము చూచితిమి

మన దేవుడు నిత్యముగా దానిని స్థిర – పరచియున్నాడు
దేవా నీ ఆలయ మందున నీ కృపను ధ్యానించితిమి

దేవా నీ నామము ఎంత గొప్పదో – నీ సత్కీర్తియును
భూదిగంతముల వరకు అంత – గొప్పదై యున్నది

ఈ దేవుడు సదాకాలము మనకు – దేవుడై యున్నాడు
మనల నడిపించును మరణపర్యంతము – హల్లెలూయా ఆమెన్


Mana dhaevuni pattanammdhaayana
parishudhdha parvathammdhu
yehoavaa goppavaadunu
bahu keerthaneeyudai yunnaadu

Uththara dhikkuna mahaaraaju pattanamaina
seeyoanu parvathamu
unnathamai amdhamugaa sarvabhoomiki
santhoashamichchu chunnadhi

Dhaani nagarulaloa dhaevudaashrayamugaa
prathyakshmbaguchunnaadu
raajulaekamugaa koodi aashcharyapadi
bhramapadi thvaragaa velliri

Achchata vaarala vaNakunu prasaviMchu sthree
vaedhana pattenu
thoorpu gaalini raepi tharsheeshu oadala
pagulagottuchunnaavu

Sainyamu ladhipathi yehoavaa dhaevuni
pattanamundhu
manamu vininatti reethigaa jaruguta
manamu choochithimi

Mana dhaevudu nithyamugaa dhaanini
sthira – parachiyunnaadu
dhaevaa nee aalaya mandhuna nee
krupanu dhyaanimchithimi

Dhaevaa nee naamamu entha goppadhoa
nee sathkeerthiyunu
bhoodhigmthamula varaku atha
goppadhai yunnadhi

Ee dhaevudu sadhaakaalamu manaku
dhaevudai yunnaadu
manala nadipimchunu maranaparymthamu
hallelooyaa aamen


Posted

in

by

Tags: