మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె
తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను
మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి
మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె
గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును
దౌర్జన్యము నొందెను – బాధింపబడెను
తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్
ఎదిరింప లేదెవరిన్ – లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్ – మహావ్యాధిని కలిగించెన్
సిలువలో వ్రేలాడెన్ – సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ – స్తోత్రము హల్లెలూయ
Manakai yaesu maranimche mana paapamula korakai
nithyajeevithamu nichchutakae sathyumdu sajeevudaaye
Thruneekarimpabade visarjimpabadenu
dhuhkhaa kraamthudaaye vyasanamula bharimchenu
Mana vyasanamula vahimchen – mana dhuhkhamula bharimchen
mana mennika chaeyakayae – mana mukhamula dhrippithimi
Mana yathikramamula koraku – mana dhoashmula koraku
mana naathudu shikshnomdhe – manaku svasthatha kalige
Gorrelavale thappithimi – parugidithimi manadhaarin
arudheMche kaapariyai – arpimchi praanamunu
Dhaurjanyamu nomdhenu – baadhimpabadenu
thananoaru theruvalaedhu – manakai krayadhanameeyan
Edhirimpa laedhevarin – laedhae kapatamu noat
yehoavaa nalugagotten – mahaavyaadhini kaligimchen
Siluvaloa vraelaaden – samaahiloa numdenu
sajeevumdai laechen – sthoathramu hallelooy