Manamaesuni vaaramu మనమేసుని వారము

మనమేసుని వారలము – తనవారిగానే యుందుము
మనలను రక్షించెను – తనకే స్తుతి పాడెదము

కృపాసత్య సంపూర్ణ వాక్యము – నరరూపియాయెను
కనుగొంటిమి తండ్రి మహిమను – జనితైక కుమారునిలో
తన ప్రేమ అద్భుతమైనది – మనము కొనియాడెదము

వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను
మనలను తానే వెలిగించెను – తన వాక్యము ద్వారనే
ప్రభు వుత్తముడని యెరిగి – తనకే స్తుతి పాడెదము

దైవపుత్రుండు సజీవరాళ్ళతో – యింటిని కట్టుచున్నాడు
దేవుని తేజము రాగా – మహిమతో నిండె గృహము
ఆయన మందిరములో – తన మహిమను పాడెదము

ఎందరిని ప్రభు ముందు యెరిగెనో – వారిని నిర్ణయించెను
పిలిచి నీతిగా తీర్చి – మహిమ పరచెను
తన తనయుని రూపమిచ్చె – మన మానంద మొందెదము

పూర్ణమహిమతో మనప్రభు యేసు – దూతలతో వచ్చును
కనిపెట్టు వారెత్తబడెదరు – తన మహిమ పొందెదరు
తన రాజ్యముగా జేసె – హల్లెలూయ పాడెదము

మహిమ నివసించు మహిమ రాజ్యంబు
మహిమతో నిండి యుండును
మన ప్రభువే దీపమై యుండును
తన వెలుగు ప్రచురమగున్
యుగయుగములు మనమంతా
ప్రభుయేసుతో నుండెదము


Manamaesuni vaaralamu – thanavaarigaanae yumdhumu
manalanu rakshimchenu – thanakae sthuthi paadedhamu

Krupaasathya sampoorna vaakyamu – nararoopiyaayenu
kanugomtimi thandri mahimanu – janithaika kumaaruniloa
thana praema adhbhuthamainadhi – manamu koniyaadedhamu

Vaaru aayana thattu choodagaa velugu kaligenu
manalanu thaanae veligimchenu – thana vaakyamu dhvaaranae
prabhu vuththamudani yerigi – thanakae sthuthi paadedhamu

Dhaivaputhrumdu sajeevaraallathoa – yimtini kattuchunnaadu
dhaevuni thaejamu raagaa – mahimathoa nimde gruhamu
aayana mandhiramuloa – thana mahimanu paadedhamu

Emdharini prabhu mumdhu yerigenoa – vaarini nirnayimchenu
pilichi neethigaa theerchi – mahima parachenu
thana thanayuni roopamichche – mana maanmdha momdhedhamu

Poornamahimathoa manaprabhu yaesu – dhoothalathoa vachchunu
kanipettu vaareththabadedharu – thana mahima pomdhedharu
thana raajyamugaa jaese – hallelooya paadedhamu

Mahima nivasimchu mahima raajymbu
mahimathoa nimdi yumdunu
mana prabhuvae dheepamai yumdunu
thana velugu prachuramagun
yugayugamulu manammthaa
prabhuyaesuthoa numdedhamu


Posted

in

by

Tags: