మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంత
వీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసి
నినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము ||మనస||
హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁ
డిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమున
కెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁ
జూపి ||మనస||
ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందు
చుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు ధరణి
రత్న రాసులైనఁ జాలువా మరేవి యైన ||మనస||
ఎందుఁ గానరాని ప్రేమను జూపించి నీకై పొందుగాఁ దన ప్రాణ
మిచ్చెను చిందిన రక్తమును యాగ మంది నట్టి శరీరంబు నందముగను
రాత్రి భోజ నంబు నందు సిద్ధపరచె ||మనస||
యేసు తనదు బల్లమీఁను సుజీవ మిచ్చు నెల్ల నష్టములు నశించును
భాసురముగ మోక్షమునని వాసివై శ్రీ యేసుతోడ యీ సుభో జనంబు
దినుట కాశీర్వాదములు నొసంగు ||మనస||
Manasa! yaathma! thaejarillumaa
yalmkarimchu konumu paapa mantha
veedumaa vinumu naeaodu yaesu neeku
ghanamugaanu vimdhuao jaesi
ninuao dhalachi chaeravachche ghanuni
velguloani kaegumu ||manasa||
hrudhaya manedu thalupuao dhattuchuao
prabhu yaesu nilachi sadhayuao
didhigoa ninnuao biluchuchu edhuru
joochuchumdu vibhuni padhayugamuna
keragi mrokki mudhamuthoadao
jaerchukonumu sadhamula magu praemao joopi ||manasa||
Dharanu sarva shraeshta bhaagyamul
varamulunu dhanamu narulu bomdhu
chumdhu ruchithamu parama rakshkum
dosmgu varashareera rakthamulaku dharani
rathna raasulainao jaaluvaa maraevi yaina ||manasa||
emdhuao gaanaraani praemanu joopimchi
neekai pomdhugaaao dhana praana
michchenu chimdhina rakthamunu yaaga
mmdhi natti shareernbu nmdhamuganu
raathri bhoaja nambu nandhu sidhdhaparache ||manasa||
yaesu thanadhu ballameeaonu sujeeva
michchu nella nashtamulu nashimchunu
bhaasuramuga moakshmunani vaasivai
shree yaesuthoada yee subhoa janmbu
dhinuta kaasheervaadhamulu nosmgu ||manasa||