మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు ప్రభున్
విరివిగ నాశీర్వాదము లొసగున్
మరువకు యేసుని యుపకారం
ధర నీకున్నది దేవునిదే యని
కోరిన ప్రబుకిడు త్వరపడుచు – ఘనంబు
దర్శించిన నీ దయగల ప్రభువునకు
హర్షముతో కొట్లను విప్పి
విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు
అర్పించి కొనియాడెదము – ఘనంబు
తనయునిలో మన కన్నియు నిడెను
మనలను ముందే తనకిడెను
పానార్పణముగ ప్రభుకర్పించి
కాలంబంతయు గడిపెదము – ఘనంబు
సంతసముగ నిడుటే ప్రభు చిత్తము
ఎంతో మెళకువతో నుండి
చింతింపక నిడుటే సరియర్పణ
వింతగు వృద్ధిని పొందెదము – ఘనంబు
పిసినితనంబుగ దోషార్పణ నిడ
వాసము చేయును లేశములు
యేసునికి నీ జీవనమియ్యను
శాసనమిదె ప్రభుదని యెరుగు – ఘనంబు
ఘనపరచును ప్రభు – మనస్సారగ నిడ
కానుకగా బలకాలములు
మన కెన్నో తన గుణముల నిడి
ఘనమును బలమును ప్రభువొసగున్ – ఘనంబు
మకెదొనియ సంఘము వలె నీకు
సకల ఇక్కట్లుండినను
శక్తికి మించి సాగిన గాని
మక్కువగా నిడి మనమిలను – ఘనంబు
Manassaara kruthajnytha liduchu ghanmbu chaeyu prabhun
Viriviga naasheervaadhamu losagun
maruvaku yaesuni yupakaarm
dhara neekunnadhi dhaevunidhae yani
koarina prabukidu thvarapaduchu – ghanmbu
Dharshimchina nee dhayagala prabhuvunaku
harshmuthoa kotlanu vippi
viriviga muriyuchu prabhunaku anniyu
arpimchi koniyaadedhamu – ghanmbu
Thanayuniloa mana kanniyu nidenu
manalanu mumdhae thanakidenu
paanaarpanamuga prabhukarpimchi
kaalmbmthayu gadipedhamu – ghanmbu
Santhasamuga nidutae prabhu chiththamu
emthoa melakuvathoa numdi
chimthimpaka nidutae sariyarpan
vimthagu vrudhdhini pomdhedhamu – ghanmbu
Pisinithanmbuga dhoashaarpana nid
vaasamu chaeyunu laeshamulu
yaesuniki nee jeevanamiyyanu
shaasanamidhe prabhudhani yerugu – ghanmbu
Ghanaparachunu prabhu – manassaaraga nid
kaanukagaa balakaalamulu
mana kennoa thana gunamula nidi
ghanamunu balamunu prabhuvosagun – ghanmbu
Makedhoniya smghamu vale neeku
sakala ikkatlumdinanu
shakthiki mimchi saagina gaani
makkuvagaa nidi manamilanu – ghanmbu