మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ
మొనరఁ దాల్చెను ధర సమాధి
బంధములను ధన్యముగను త్రెంచి లేచి
కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||
మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు
దినోదయమునఁ బ్రియ మగు గురుని
దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ
దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ
||మరణమున్||
నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను
మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ
జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||
వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల
భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార
భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||
కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు
చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు
రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||
మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును
గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు
దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||
మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య
వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ
బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||
అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము
వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు
లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||
Maranamun jayimchi laechenu mana
prabhuvu naeaodu mahima dhaeha
monarao dhaalchenu dhara samaadhi
bandhamulanu dhanyamuganu thremchi laechi
koratha lanni theerchi jeeva varamu
liyya vasudhapaini ||maranamun||
Mariyayunu saloami modhalagu maguvalu sabaathu maru
dhinoadhayamunao briya magu guruni
dhaehamunakuao booyao barimalmpuao
dhailamulanu saragao dheesikoni samaadhi
karugudhemchi kanulaojooda ||maranamun||
Naeaodu prabhusamaadhi mukhamupai nunna
raayi nevaodu dheeyu karunanu
manakai chaediya litlanuchu vaegao jaeri
yaa samaadhi mooaotha veedi yumtao
joochi migula vismayammu nmdhi rapudu ||maranamun||
Vaaru thella niluvutmgiaothoa goorchunna
paduchu vaaniao joochi migula
bhayamuthoaao jaeraraaka nilichiyunna
vaari nathadugaamchi yamma laara
bhayapadaku datmchu nooradimche nuchithamuganu ||maranamun||
Koratha paini marana momdhina najaraeyuao
daesu koraku migula vedhaku
chumdina tharunulaara mee prabhumdu thirigi
brathike nikka midhdhi saragapaethu
raadhi shishya samithithoadao jeppudaniye ||maranamun||
Maanithamuga meekita mumdhu prabhu
vanina yatlu kaanaobadunu
galilaiya mandhu gaana veLludmchu
bhaasi thaanarumdu palka vinuchu
dheena janulu jadisi migula dhigulu
nomdhi vanaki rapudu ||maranamun||
Modhata magdhalaenae mariyakuao ganaobade
natmchu sudhathi dhelpe shishya
varulaku kodhuvalaeni santhasamuna goarke
dheerao brabhuniao joodao
badhilamaina yathnamulaku baraga jaesi
choochi rapudu ||maranamun||
Amthhshathru vaina maranamunu prabhuvu
gelche santhasinchi sannuthinthamu
vantha laela bhakthulaara vaasthavamuga
manala nitula nanthya dhinamu nandhu
laepu namala dhaehamula nosmgu ||maranamun||