Maranamunaku మరణమునకు

మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది
యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ||

క్షయమందు విత్తఁబడి య క్షయమునందు
లేచురా ప్రియుడు క్రీస్తునందు
మృతులు పెం పొసంగు ధన్యులు ||మరణ||

లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను
యేసు ప్రేమతో దాఁటించురా ||మరణ||

ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము
పరమ దేవుని డుండునట్టి
పరదైసునకుఁ బోదుము ||మరణ||

గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల
నొక్క క్షణములో బ్రతికించురా ||మరణ||

బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు
జీవ ధారులై లేచెదరురా ||మరణ||

భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము
ధరించి రక్తితో జీవింతురు ||మరణ||

కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన
ప్రభుని చరణములు నుతించుఁడీ ||మరణ||


Maranamunaku vijaya maedhi marana
moadipoayeraa marana momdhi
yaesu prabhuvu marala brathiki laecheraa ||marana||

Kshyammdhu viththaobadi ya kshyamunmdhu
laechuraa priyudu kreesthunmdhu
mruthulu pem posmgu dhanyulu ||marana||

Laukika dhaehamu vidi para loaka dhaehi
yagunuraa bheekara yoardhaanu
yaesu praemathoa dhaatinchuraa ||marana||

Dharani dhuhkha baaDha lanni dharaniymdhe
viduthumu parama dhaevuni dumdunatti
paradhaisunaku boadhumu ||maraNa||

Gagana veedhinmdi yaesu grakkuna
vaem chaeyuraa jagathi sarva mruthula
nokka kshnamulo brathikimchuraa ||marana||

Boora raava maalakimchi bhoomi yella
vanakuraa vaaradhiloa mruthulu
jeeva dhaarulai laechedharuraa ||marana||

Bhakthulu vishvaasamunaku phlamu
nomdha boadhuru murthi kireetamu
dharimchi rakthithoa jeevimthuru ||marana||

Karunalaeni maranamunaku veravakumda
nundudi maranavijayudaina
prabhuni charanamulu nuthimchudee ||marana||


Posted

in

by

Tags: