మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తును
ప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ //మేము//
బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁ
బేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో //మేము//
జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యము
వాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము //మేము//
తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగా
హద్దులేని పాపమంత – రద్దుపరచబడెనుగా //మేము//
మరణమెపుడొ రేపొమాపో – మరియెపుడో మన మెరుగము
త్వరగా పోయి పరమగురుని – దరిశనంబుఁ జేతము //మేము//
పరిశుద్ధాత్మ జన్మ మాకు – వరముగా నొసంగెను
పరమపురము మాకు హక్కు – పంచెదాను నిరతము //మేము//
మాకు సర్వగర్వమణిగి – మంచి మార్గమబ్బెను
మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను //మేము//
Memu velli chuchinaamu swami Yesu Kreesthunu
Prema mrokka vachhinaamu – Maa manambu lalaraga //Memu//
Betalemupuramulona – beedakanya Mariyaku
Bedagaa suropudaalchi – velase basulapaaalo //Memu//
Jnaanulamani garvapadaka – deenulamai nityamu
vaani prema sakala prajaku – maanaka prakatintumu //Memu//
Taddarisanamandu maaku = beddamelu kaligeraa
Hadduleni paapamanta – radduparachabadenuga //memu//
Maranamepudo repomaapo – mariyepudo manamerugamu
twaraga poyi paramaguruni – darishanambu jetamu //memu//
Parishuddhatma Janma maaku – varamuga nosangenu
Pramapuramu maaku hakku – panchedaanu niratamu //memu//
Maaku sarvagarvamanigi – manchi maargamabbenu
Maaku nee suvaartha jeppa makkuvento galigenu //memu//