మిమ్మునునింపె మేలులతోడ
అవియే పరలోక దీవెనలు
ఆయన మందిర మందే మీకు
అధిక దీవెనలు దొరుకును ఎన్నో
తన మందిర సమృద్ధిని పొంది
త్రాగుడి జీవజలములను
మీ పాపములను పరిహరించును ప్రభు
మీకు విమోచన తనయందే కలదు
సత్యుని కృపామహదైశ్వర్యముతో
సంతోషించుడి మీరు
తన రక్తముతో విమోచించిన
వారికి ప్రభువు యిచ్చును స్వాస్థ్యము
తేజోవాసులు పరిశుద్ధులతో
పాలివారినిగా చేసె
ప్రభు యేసు నెందరు స్వీకరించెదరో
నిత్యజీవమును స్వతంత్రించుకొని
పరిశుద్ధాత్మ వరమును పొంది
ఆత్మలో ఆనందించెదరు
మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు
మునుపటికన్న హెచ్చుగా నిచ్చి
మీతో నుండగోరెను నిత్యము
పొందుడి ప్రభు దీవెనలు
ఆయన కృపలో వర్థిల్లినచో
అనుదినము ప్రభు మిము దీవించును
తన కృప మిమ్ము ఆవరించును
ఆనందించుడి కృపతో
జయ జీవితమును కలిగినవారే
తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు
విశ్వాసముతో విజయముపొంది
పాడుడి హల్లెలూయ ప్రభుకే
Mimmununimpe maelulathoad
aviyae paraloaka dheevenalu
aayana mandhira mandhae meeku
adhika dheevenalu dhorukunu ennoa
thana mandhira samrudhdhini pomdhi
thraagudi jeevajalamulanu
mee paapamulanu pariharimchunu prabhu
meeku vimoachana thanaymdhae kaladhu
sathyuni krupaamahadhaishvaryamuthoa
santhoShimchudi meeru
thana rakthamuthoa vimoachimchin
vaariki prabhuvu yichchunu svaasthyamu
thaejoavaasulu parishudhDhulathoa
paalivaarinigaa chaese
prabhu yaesu nemdharu sveekarimchedharoa
nithyajeevamunu svathmthrimchukoni
parishudhdhaathma varamunu pomdhi
aathmaloa aanmdhimchedharu
mimmunu sthirulugaa chaeyunu prabhuvu
munupatikanna hechchugaa nichchi
meethoa numdagmoarenu nithyamu
podhudi prabhu dheevenalu
aayana krupaloa varthillinachoa
anudhinamu prabhu mimu dheevimchunu
thana krupa mimmu aavarimchunu
aanmdhimchudi krupathoa
jaya jeevithamunu kaliginavaarae
thana svaasthyamunu migula pomdhedharu
vishvaasamuthoa vijayamupomdhi
paadudi hallelooya prabhukae