Naa chinni thandri paraloka raajaa నా చిన్ని తండ్రి పరలోక రాజా

నా చిన్ని తండ్రి పరలోక రాజా
బాలయేసుగా
పవలించితివి పశుల పాకలో

నీదు జననము మానవాళికి
ఎంతో పరవశము
నీదు జననము లోకానికి
ఎంతో శుభోదయం
నీదు జననము మాకు
ఇల రక్షణకు శ్రీకారము
లాలీ జో లాలీ జో

దూత సమూహముల స్తోత్రగానములు
ఇల లేవు నీకు నేను పాడే కీర్తనలు తప్ప
అందుకో నా పేద హృదయపు లాలి పాట

లోక రక్షణకు ఇల విమోచనకు
ఈ పృథ్వి పావనమైనది
నీ స్పర్శ సోకగనే
నీ చిన్ని నవ్వులే నాకు చాలు
మాకు ఈ బ్రతుకంతా


Naa chinni thandri paraloka raajaa
baala yesugaa
pavalinchithivi pasula paakalo

needhu jananamu maanavaaliki
entho paravasamu
needhu jananamu lokaaniki
entho subhodhayam
needhu jananamu maaku
ila rakshanaku sreekaaramu
laali jo laali jo

dootha samuuhamula sthothra gaanamulu
ila levu neeku nenu paadey keerthanalu thappa
andhuko naa pedha hrudhayapu laali paata

loka rakshanaku ila vimochanaku
ee pruthvi paavanamainadi
nee sparsa sokaganey
nee chinni navvule naaku chaalu
maaku ee brathukanthaa


Posted

in

by

Tags: