Naa hrudhyamantha
నా హృదయమంత

ఈ లోకము నను విడచినను
నను విడువని నా దేవుడవు
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై – నన్నాధుకొంటివి . .

నా హృదయమంత నీ కొరకే.. సమర్పింతును దేవా..
నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు….
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను

సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి.
నన్నాధరించి – చేరదీసి
కన్నీరు తుడచి – హత్తుకొంటివి

నా హృదయమంత నీ కొరకే… సమర్పింతును దేవా..
నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు….
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను.

యేసయ్యా…….

నా చింతలన్ని తీరెనయ్య – నిన్ను చేరిన క్షణమే.
నిత్య జీవితం దొరికేనయ్యా- నిన్ను చూసిన క్షణమే. (3)

నా వ్యాధులన్నీ తొలిగేనయ్య – నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయేనయ్య – నిన్ను నమ్మినా క్షణమే..

నా అడుగులన్ని స్తి‌రపరచువాడా – నా త్రోవలను సిద్ధపరచువాడా..
నీ చిత్తములో నన్ను నడుపుమయ్య – నీ వాఖ్యముతో నన్ను నింపుమయ్యా



Ee lokamu nanu vidachina
nannu viduvani naa dhevudavu
evvaru leni ee jeevithamulo
naa thodu neevai – nannaadhukontivi

Naa hrudhyamantha nee korakai – samarpinthunu deva
naa jeevithamantha nee saakshiga nilichedanu yesu
nee margamulo ne nadichedanu – nee chittamulo ne saagedhanu

Solipoyina naa praanamu cheyyi patti nannu lepithivi
nannaadharinchi cheradeesi
kanneeru thudachi hattukontivi

Naa hrudhyamantha nee korakai – samarpinthunu deva
naa jeevithamantha nee saakshiga nilichedanu yesu
nee margamulo ne nadichedanu – nee chittamulo ne saagedhanu

Yesayya…

Na chintalanni theerenayya – ninnu cherina kshaname
nityajeevitham dhorikenayya – ninnu choosina kshaname

na vyaadhulanni tholigenayya – ninnu thaakina kshaname
na bayaalanni poyenayya – ninnu nammina kshaname

na adugulanni sthiraparachuvaada – na throvalanu siddaparachuvaada
nee chittamulo nannu nadupuvaada – nee vaakyamutho nannu nimpumayya


Posted

in

by

Tags: