Nashtamu nanthatini నష్టము నంతటిని

ఆనందించెదము – ప్రభు యేసులో – అంతయు మరలార్జించు కొంటిమి
ఆదాము నుండి పోయిన దెల్లయు – అనుభవించు చున్నామిప్పుడు

పల్లవి: నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము

దావీదువలె అంత నష్టపడితిమి – దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ – తిరిగి ఆర్జించుకొంటిమి

పూర్వము నైక్యము లేకపోయెను – పేదలమై యుంటిమి అపుడు
మనలను ఖాళీ చేసికొనగా – మరల నొందితిమి పూర్ణత

మొదటి ప్రమను కోల్పోతిమిల – వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
పొందితిమి యేసు ప్రభువులో – నిండుగను దైవ ప్రేమను

దేవుని కల్గియుండకుంటిమి – దైవసమాధాన మొందకుంటిమి
పాపములలో మరణించియుంటిమి – పరమజీవ మొందితిమి

నిరీక్షణయేమి లేక యుంటిమి – నరకమున కర్హులమై యుంటిమి
ఘనుడగు యేసు నంగీకరింపగా – నన్నును విమోచించెను

పాపము వలనెంతో నష్టపోతిమి – ప్రభులో సకలము సంపాదించితిమి
శాపమునందు చుట్టబడితిమి – సర్వమొందెదము మరల


Aanamdhimchedhamu – prabhu yaesuloa
amthayu maralaarjiMchu koMtimi
aadhaamu nuMdi poayina dhellayu
anubhaviMchu chunnaamippudu

Chorus: nashtamu nanthatini marala
maa yaesuniloa aarjiMchithimi
ellappudu jeevithamathayu hallelooya paadedhamu

dhaaveedhuvale aMtha naShtapadithimi
dhuHkhapadi bahugaa aedchithimi
dhaaveedhuvale prabhuni vedhakaga
thirigi aarjiMchukoMtimi

poorvamu naikyamu laekapoayenu
paedhalamai yuMtimi apudu
manalanu khaaLee chaesikonagaa
marala noMdhithimi poorNath

modhati pramanu koalpoathimila
vyarThamainatti praemanoMdhithimi
poMdhithimi yaesu prabhuvuloa
niMduganu dhaiva praemanu

dhaevuni kalgiyuMdakuMtimi
dhaivasamaaDhaana moMdhakuMtimi
paapamulaloa maraNiMchiyuMtimi
paramajeeva moMdhithimi

nireekShNayaemi laeka yuMtimi
narakamuna karhulamai yuMtimi
ghanudagu yaesu nMgeekariMpagaa
nannunu vimoachiMchenu

paapamu valaneMthoa naShtapoathimi
prabhuloa sakalamu sMpaadhiMchithimi
shaapamunMdhu chuttabadithimi – sarvamoMdhedhamu maral


Posted

in

by

Tags: