Navanni amgikarimchumi నావన్ని అంగీకరించుమీ

నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన భావంబునను నేను బహుదైర్యమొందెద

నీకు నా ప్రాణము నిజముగ నర్పించి
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద

సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని
నిత్యంబు గరముల నీ సేవ జేసెద

నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు
ఆశచే నడిపించు మరల నా పదములు

పెదవులతో నేను బెంపుగ నీ వార్త
గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి

నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ
యావంత యైనను నాశించ మదిలోన

నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే సేవ
జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు

చిత్తము నీ కృపా యత్తంబు గావించి
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము

హృదయంబు నీకిత్తు సదనంబు గావించి
పదిలంబుగా దాని బట్టి కాపాడుము


Navanni amgikarimchumi deva nannepudu nivu karunimchumi
Navanni krupacheta nivalana nomdina
bavambunanu nenu bahudairyamomdeda

Niku na pranamu nijamuga narpimchi
niku midugatti ni koraku nilpeda

Satyambu ni prema chakkaga madhi buni
nityambu garamula ni seva jeseda

Ni seva jarigedu ni alayamunaku asache
nadipimchu marala na padamulu

Pedavulato nenu bempuga ni varta gadalaka
prakatimpa galigimchu drudabakti

Na vemdi kanakambu na tamdri gaikonimi
yavamta yainanu nasimcha madilona

Nivu na kosagina nirmala buddiche seva
jeyaga nimmu sthirabaktito niku

Chittamu ni krupa yattambu gavimchi
mattilla kumdaga margambu delupumu

Hrudayambu nikittu sadanambu gavimchi
padilambuga dani batti kapadumu


Posted

in

by

Tags: