నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ
కరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగ
నన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ కన్న||
నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపము
లన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యక
యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి ||నీ కన్న||
వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ బ్రోచితి
తుదిదినంబునఁ గలుగు బాధలుఁ దొలఁగ జేయుట నీవ యని నా
హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక ||నీ కన్న||
నీ వాక్యార్థము నాలో నివసింపఁ జేసి నీ సేవకునిగఁ బ్రోవవే నీవె
సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకిం కెవరు
లేరు కావవే నను యేసునాయక ||నీ కన్న||
Nee kanna niAOka vaerae vaelpulu laerayyaa
nijamugaa naa yaesuvaa nee
karuNa yanu nenaruchaethanu needhu
sathya suvaartha dhvaara praakatMbuga
nannuao bilichina loaka rakShka neeku mrokkedha ||nee kanna||
ninnuao dheliyaka munnu nanya
dhaivMbula nanusariMchina paapamu
lanni penagoni naadhu hrudhayapuAO
gannu AO grammi prakaasha miyyaka
yunna nee vimalaathma varamuna nannu
veligiAOchina dhayaaniDhi ||nee kanna||
vadhalaka naeAO jaeyu thudha laeni
paapamu vadhaliMchi nanuAO broachithi
thudhidhinMbunAO galugu baaDhaluAO
dholAOga jaeyuta neeva yani naa
hrudhayamMdhuna naa nireekShNa padhilaparachina
bhaktha paalaka ||nee kanna||
nee vaakyaarThamu naaloa nivasiMpAO
jaesi nee saevakunigAO broavavae neeve
sathyamu neeve jeevamu neeve maargamu
neeve dhvaaramu neevu gaakiM kevaru
laeru kaavavae nanu yaesunaayaka ||nee kanna||