నీ కృపయి కనికరము
కలిసి నన్ను దర్శించేనే
దయా దాక్షిణ్యము కృప వాత్సల్యము
కరుణాకటాక్షము ప్రేమామృతం
దివి నుండి దిగివచ్చి నన్ను దీవించెను
దరిలేని గురిలేని అలనై నేవుండగా
చల్లని గాలివై దరి చేర్చినావే
నా చెంత చేరావే చింతలన్ని తీర్చావే
నిరాశలోన నిరీక్షణవైనావే
పడిపోయి ఓడిపోయి కుమిలి పోవుచుండగా
అవమానపాలై నే కృంగిపోగా
నా తోడునీడవై నన్ను ఓదార్చావే
నా గూడు చేరి నా గోడు విన్నావే
nee krupayu kanikaramu
kalisi nannu dharsinchene
dhayaa dhaakshinyamu krupa vaathsalyamu
karunaa kataakshamu premaamrutham
dhivi nundi dhigi vachi nannu dheevinchenu
dhari leni guri leni alanai ne undagaa
challani gaalivai dhari cherchinaave
naa chentha cheraave chinthalanni theerchaave
niraasalona nireekshanavainaave
padipoyi odipoyi kumili povuchundagaa
avamaanapaalai ne krungipogaa
nee thoduneedavai nannu odhaarachaave
naa goodu cheri naa godu vinnaave