నీలా ప్రేమించేవారెవరు ఇలలో లేరు
నీవే ప్రేమామయా “2”
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నీ మహిమనంతా విడచి
నాకొరకై దిగివచ్చితివే
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నా శిక్ష అంతా ఆ సిలువలో
నాకొరకై భరియించితివే
అంధకారములో ఆశాజ్యోతివై
చీకటి బ్రతుకును నీ వెలుగుతో నింపావు “2”
పరమును విడచి భువికేతించి నన్ను విమోచించావు
నీదు రాజ్య వారసునిగా నన్ను చేసుకున్నావు
ఎవరూ చేయని సాహసం నాకై సిలువలో నీవు చేసావు
వధకు తేబడిన గొర్రెపిల్లగా నాకై నీవు మారావు
“నిన్ను”
తల్లి మరచినా నీవు మరువవు
తండ్రి విడచినా నీవు విడువవు “2”
నను అనాధగా విడువనని వాగ్దానం చేసిన నాధుడవు
ఆత్మరూపిగా నాలో నివసించి నను ఆదరించావు
త్వరలో పరమునకు నన్ను కొనిపోవ
తిరిగి రానైయున్నావు
యుగయుగాలు నీతో ఉండే భాగ్యం నాకు ఇచ్చావు
“నిన్ను”
neela preminchevaarevaru ilalo leru
neeve premaamayaa
neela preminchevaarevaru ee dharalo leru
neeve premaamayaaninnu nenu preminchakamundhe
nannu neevu preminchithive
nee mahimananthaa vidachi
naa korakai dhigi vachithive
ninnu nenu preminchakamundhe
nannu neevu preminchithive
naa siksha anthaa aa siluvalo
naa korakai bhariyinchithive
andhakaaramulo aasaa jyothivai
cheekati brathukunu nee velugutho nimpaavu
paramunu vidachi bhuvikethenchi nannu vimochinchaavu
needhu raajya vaarasunigaa nannu chesukunnaavu
evaru cheyani saahasam naakai siluvalo neevu chesaavu
vadhaku thebadina gorrepillagaa naakai neevu maaraavu
thalli marachinaa neevu maruvavu
thandri vidachinaa neevu viduvavu
nanu anaadhagaa viduvanani vaagdhaanam chesina naadhudavu
aathmaroopigaa naalo nivasinchi nanu aadharinchaavu
thwaralo paramunaku nannu konipova thirigi raanaiyunnaavu
yugayugaalu neetho unde bhaagyam naaku ichaavu