Neeti suryudaina Yesu raakatone నీతిసూర్యుడైన యేసు రాకతోనే

నీతిసూర్యుడైన యేసు రాకతోనే
పాపభీతినొందు మానవాళి దిగులు పోయెనే /2/
జ్యోతిర్మయుడైన దేవుడు తానె /2/
భానుడుగా భువిపైన కాలుమోపగానే
చీకటి శక్తులకు వణుకుపుట్టెనే /నీతి/

ప్రభుసన్నిధిలో ఆనందముండును
కీడుచేయు శత్రువులను దూరపరచును
బంధకములను తెంపివేయను – మన బంధకములు తెంపివేయను
ఇమ్మానుయేలుగా అవతరించెను – యెహోవా షమ్మా మన మధ్యనుండెను /నీతి/

ప్రభు సన్నిధిలో ఆరోగ్యముండును
పాడుచేయు రోగములను స్వస్థపరచును
దుఃఖమును మాన్పివేయను – మన దుఃఖమును మాన్పివేయను
ఆశ్చర్యకరుడుగా అవతరించెను –నీతిసూర్యుడుగా మన మధ్యనుండెను /నీతి/

ప్రభుసన్నిధిలో సమాధానముండును
వేరుచేయు పాపములను శుభ్రపరచును /2/
చింతలను తీర్చివేయను – మన చింతలను తీర్చివేయను
ఆపద్బాంధవుడిగా అవతరించెను – యెహోవా షాలోమ్ మన మధ్యనుండెను /నీతి/


Neeti suryudaina Yesu raakatone
paapabheetinondu maanavaali digulu poyene! /2/
jyotirmayudaina devudu taane /2/
Bhaanudugaa bhuvipaina kaalu mopagaane
Cheekati shaktulaku vanuku puttenu /neeti/

Prabhu sannidhilo aanandamundunu
Keedu cheyu satruvulanu dooraparachunu
Bandhakamulanu tempiveyunu – Mana bandhakamulu tempiveyunu
Emmaanuyelugaa avatarinchenu
Yehovaa shamma mana madhyanundenu /neeti/

Prabhu sannidhilo aarogyamundunu
paaducheyu rogamulanu swasthaparachunu
Dukhamunu maanpiveyunu – Mana dukhamunu maanpiveyunu
Aaschryakaruduga avatarinchenu
Neeti suryuduga mana madhyanundenu /neeti/

Prabhu sannidhilo samaadhaanamundunu
verucheyu paapamulanu subharaprachunu /2/
Chintalanu teerchiveyunu – mana chitalanu teerchiveyunu
Aapadbhaandavuduga avatarinchenu
Yehova shaalom mana madhyanundenu /neeti/


Posted

in

by

Tags: