నీవంటివారు లేరెవ్వరు
మహిమైశ్వర్యములో నీకు సమమేవారు
ఆకాశమందు ఆసీనుడైనవాడా
కృప సత్యసంపూర్ణుడ
భూమిని పాదపీఠముగా చేసినవాడే
నిత్యుడగు ప్రేమపూర్ణుడ
పాపినైన నా కొరకై
పరమును వీడిన ప్రభువా
నా కొరకై వెదకితివి
నా పాపమంతా కడిగితివి
ఏమర్పింతును దేవా
నీవు చేసిన గొప్ప కార్యముకై
ఏమిచ్చెదను ఓ ప్రభువా
ఎనలేని నీ ప్రేమకై
రక్షణ పాత్రను
చేతబూని నీ రాజ్యసువార్తను చాటెదను
చీకటైన నా బ్రతుకులో
చిరుదివ్వెగా వెలిగితివి
కఠినమైన నా హృదిని
నీ ప్రేమతో కరిగించితివి
ఏమర్పింతును దేవా
నీవు చేసిన గొప్ప కార్యముకై
ఏమిచ్చెదను ఓ ప్రభువా
ఎనలేని నీ ప్రేమకై
రక్షణ పాత్రను
చేతబూని నీ రాజ్యసువార్తను చాటెదను
Neevantivaaru Lerevvaru
Mahimaishwaryamulo neeku samamevaru
Aakasamandhu aaseenudainavaada
Krupa sathyasampoornuda
Bhoomini paadhapeetamuga chesinavada
Nithyudagu premapoornuda
Paapinaina na korakai
Paramunu veedina prabhuva
Na korakai vedhakithivi
Na paapamantha kadigithivi
Yemarpinthunu deva
neevu chesina goppa kaaryamukai
Yemicchedhanu O Prabhuva
Yenaleni nee premakai
Rakshana paathranu
Cheythabooni nee rajyasuvarthanu chatedhanu
Cheekataina na brathukulo
Chirudhivvega veligithivi
Katinamaina na hrudhini
Nee prematho kariginchithivi
Yemarpinthunu deva
neevu chesina goppa kaaryamukai
Yemicchedhanu O Prabhuva
Yenaleni nee premakai
Rakshana paathranu
Cheythabooni nee rajyasuvarthanu chatedhanu