నీవు దేనిని వెదకుచున్నావు – ఈ పాపలోకము నందు
విను యేసుని స్వరమును
ఈ సూర్యుని క్రింద నీవు – బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు
ఆనంద ధన ఘనతలు – పొందగోరుచునున్నావు
ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు – దుఃఖంబె లోకమంతయును
చింతింతువు ఒకనాడు
దేవుని రాజ్యము నీతి – వెదకుము నీవు మొదట
బహు చెంతనుండె నీకు – మారు మనస్సు నొందుము నేడె
నూతన జన్మమును పొంది – ప్రవేశించుట అందున
అంగీకరించుము నేడె
శాశ్వత రాజ్యము పొంద – యోగ్యత అవసరము
ఆత్మలో దీనులు – వారిదే నిత్య రాజ్యం
దుఃఖపడువారును – విరిగిన హృదయులందరును
శాంతి ఆనందం పొందెదరు
కనికరము గలవారు – హౄదయ శుద్ధి గలవారు
సమాధానపరచువారు – తన పుత్రులవుదురు
హింసను పొందువారు – దీర్ఘ శాంతము గలవారున్
ఆ రాజ్యములో నుందురు
Neevu dhaenini vedhakuchunnaavu – ee paapaloakamu nMdhu
vinu yaesuni svaramunu
Ee sooryuni krimdha neevu – budhdhi jnYaanamu vedhakuchunnaavu
aanmdha dhana ghanathalu – pomdhagoaruchununnaavu
ivi yanniyu vyarThamae erugu – dhuHkhMbe loakamMthayunu
chiMthiMthuvu okanaadu
dhaevuni raajyamu neethi – vedhakumu neevu modhat
bahu cheMthanuMde neeku – maaru manassu noMdhumu naede
noothana janmamunu poMdhi – pravaeshiMchuta aMdhun
aMmeekariMchumu naede
shaashvatha raajyamu poMdha – yoagyatha avasaramu
aathmaloa dheenulu – vaaridhae nithya raajyM
dhuHkhapaduvaarunu – virigina hrudhayulMdharunu
shaaMthi aanMdhM poMdhedharu
kanikaramu galavaaru – hroadhaya shudhDhi galavaaru
samaaDhaanaparachuvaaru – thana puthrulavudhuru
hiMsanu poMdhuvaaru – dheergha shaaMthamu galavaarun
aa raajyamuloa nuMdhuru