నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు
ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి
||నీవు||
నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను
నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత
నిలలోన ||నీవు||
నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు
చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల ||నీవు||
నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ డేడి జీవుల
కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసఁగి జీవులఁ బ్రోచెడి
||నీవు||
నీవంటి ధనవంతుఁడేడి యేసు నా వంటి ధనహీనుఁ డేడి ప్రోవులై
యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు ననుఁ గావు
||నీవు||
Neevu thoadai yunnAOjaalu yaesu
nithyamu naakadhi maelu neevu
DharaNinumdu neechapaapula nellaogaavAO
braema vachchi ghana praaNa midinatti
||neevu||
ninuAO boalu rakShkuM daedi kreesthu
nanuAO boalu paathakuM daedi ninu
nammu vaaralaku nee vosAOguchuMdhuvu
thanarAO paapakShma dhayachaetha
nilaloana ||neevu||
nee paati balavMthuAO daedi prabhu
naapaati dhurbaluM daedi kaapaadu
chuMdhuvu kalakaalamunu neevu nee
paadha saevakula neenaerpurMjilla ||neevu||
neevMti yupakaari yaedi kartha
naavMti kadu dheenuAO daedi jeevula
kunu galgu jeevMbu lichchuchu
jeevaaDhaaramu losAOgi jeevulAO broachedi
||neevu||
neevMti DhanavMthuAOdaedi yaesu naa
vmti DhanaheenuAO daedi proavulai
yunnavi yeevulu neeyMdhu neevuvaani
nosmgi nirathMbu nanuAO gaavu
||neevu||