Noothanamaina yerushlaemu నూతనమైన యెరుషలేము

నూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణము
దానికి మనలను పాత్రుల జేసిన
మన ప్రభు యేసుకే వందన స్తుతులు

సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నది
శాంతి దాత యేసు ప్రభువు యేలుచున్న రాజ్యములో
మనలను పాలివారిగ జేసిన రారాజునకే స్తోత్రములు

మన పాపములను క్షమియించెనుగా కల్వరిసిలువ రక్తము ద్వారా
తన పరిశుద్ధతయందు మనల జేసె
మహిమాపూర్ణుడ మాదేవ మనసార నిను పాడెదను

పరిశుద్ధ పట్టణము యెంతో సౌందర్యము కలిగియున్నది
భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా
తన వధువుగా జేసిన ప్రభుకే స్తుతిచెల్లించెదము నిరతం

దేవుడే మనతో నివసించును – కాపురముండును మనతో నిత్యము
దేవుడే మనకు తోడై యుండి – నడుపును మనల పరమునకు
మనలను ప్రేమించిన ప్రభునే ఆరాధించి మ్రొక్కెదము

మనకన్నుల ప్రతి భాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు
మరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధ నగరములో
మరణము లోకము సాతానున్ – గెలిచిన ప్రభునే పూజింతుము


Noothanamaina yeruShlaemu parishudhDha pattaNamu
dhaaniki manalanu paathrula jaesin
mana prabhu yaesukae vMdhana sthuthulu

samaaDhaana sMthoaShmu paripoorNamugaa niMdiyunnadhi
shaaMthi dhaatha yaesu prabhuvu yaeluchunna raajyamuloa
manalanu paalivaariga jaesina raaraajunakae sthoathramulu

mana paapamulanu kShmiyiMchenugaa
kalvarisiluva rakthamu dhvaaraa
thana parishudhDhathayMdhu manala jaese
mahimaapoorNuda maadhaeva manasaara ninu paadedhanu

parishudhDha pattaNamu yeMthoa sauMdharyamu kaligiyunnadhi
bhartha koraku sidhDhapadina peMdli kumaarthegaa nuMdenugaa
thana vaDhuvugaa jaesina prabhukae
sthuthichelliMchedhamu nirathm

dhaevudae manathoa nivasiMchunu
kaapuramuMdunu manathoa nithyamu
dhaevudae manaku thoadai yuMdi – nadupunu manala paramunaku
manalanu praemiMchina prabhunae aaraaDhiMchi mrokkedhamu

manakannula prathi bhaaShpamulanu
thudichivaeyunu mana prabhu yaesu
maraNamu dhuHkhamu vaedhanayuMdadhu
parishudhDha nagaramuloa
maraNamu loakamu saathaanun
gelichina prabhunae poojiMthumu


Posted

in

by

Tags: